ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అండమాన్‌-నికోబార్‌ దీవులకు ‘పరమ్‌ వీర్‌’ల పేర్లు

ABN, First Publish Date - 2023-01-24T02:42:57+05:30

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్మారకార్థం అండమాన్‌-నికోబార్‌ దీవుల్లో నిర్మించేందుకు ప్రతిపాదించిన మెమోరియల్‌ నమూనాను ప్రధాని మోదీ సోమవారం వర్చువల్‌గా ఆవిష్కరించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోర్ట్‌ బ్లెయిర్‌, జనవరి 23: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్మారకార్థం అండమాన్‌-నికోబార్‌ దీవుల్లో నిర్మించేందుకు ప్రతిపాదించిన మెమోరియల్‌ నమూనాను ప్రధాని మోదీ సోమవారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. నేతాజీ 126వ సందర్భంగా ప్రధాని ఆయనకు నివాళులర్పించారు. ‘పరాక్రమ్‌ దివస్‌’ సందర్భంగా అండమాన్‌- నికోబార్‌లోని 21 దీవులకు ‘పరమ్‌ వీర్‌ చక్ర’ అవార్డు గ్రహీతల పేర్లను పెట్టారు. వలస పాలనకు వ్యతిరేకంగా నేతాజీ పోరాటం చిరస్మరణీయంగా నిలిచిపోతోందని మోదీ అన్నారు. 1943లో అండమాన్‌ గడ్డ మీదే మొట్టమొదటి సారి నేతాజీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారని గుర్తు చేశారు. జనంలో మంచి పేరు పొందేందుకే అండమాన్‌-నికోబార్‌ దీవులకు మళ్లీ పేర్లు పెట్టారని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత ఆరోపించారు.

ఆ ముగ్గురూ..

అండమాన్‌- నికోబార్‌ దీవులకు ‘రియల్‌ హీరో’ల పేర్లు పెట్టారు. వారిలో ముగ్గురు మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. వారు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన రైఫిల్‌మన్‌ సంజయ్‌ కుమార్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్రెనెడర్‌ యోగేందర్‌ సింగ్‌ యాదవ్‌, జమ్మూకు చెందిన నైబ్‌ సుబెదర్‌ బనా సింగ్‌. వీరిలో యోగేందర్‌ సింగ్‌ 19 ఏళ్లకే పురస్కారం అందుకున్నారు.

Updated Date - 2023-01-24T02:42:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising