ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anita Bose : మా నాన్న వామపక్షవాది

ABN, First Publish Date - 2023-01-22T00:38:49+05:30

స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్‌ వారికి ఎదురొడ్డి.. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పేరిట ఏకంగా సైన్యాన్నే ఏర్పాటు చేసి కదంతొక్కిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ గురించి ఎప్పుడు విన్నా గుండె ఉప్పొంగుతుంది. ఆయన ఘన కీర్తిని కొంతైనా సొంతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆయన భావజాలం ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీకి పూర్తి భిన్నం

సుభాష్‌ చంద్రబోస్‌ కుమార్తె అనితా బోస్‌ వ్యాఖ్యలు

కోల్‌కతా, జనవరి 21: స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్‌ వారికి ఎదురొడ్డి.. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పేరిట ఏకంగా సైన్యాన్నే ఏర్పాటు చేసి కదంతొక్కిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ గురించి ఎప్పుడు విన్నా గుండె ఉప్పొంగుతుంది. ఆయన ఘన కీర్తిని కొంతైనా సొంతం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇదే క్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌) కోల్‌కతాలో ఈ నెల 23న నేతాజీ జయంతిని నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, దీనిపై సుభాష్‌ చంద్రబోస్‌ కుమార్తె అనితా బోస్‌ మండిపడ్డారు. తన తండ్రి వామపక్షవాది అని.. ఆయన భావజాలానికి ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ ఆలోచనలకు ఏమాత్రం పొంతన లేదని పేర్కొన్నారు. నేతాజీ బోధించిన సర్వ మత సమభావం అనే ఆలోచనకు కాషాయ కూటమికి ఏమాత్రం సంబంధం లేదన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ తలపెట్టిన కార్యక్రమం నేతాజీకి ఉన్న గొప్ప పేరును వాడుకునేందుకేనంటూ మండిపడ్డారు. అంతేగాక సుభాష్‌ బోస్‌ దృక్పథం కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరగా ఉంటుందని వ్యాఖ్యానించారు. కాగా, సోమవారం నేతాజీ జయంతి కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ పాల్గొని ప్రసంగించనున్నారు.

Updated Date - 2023-01-22T00:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising