ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mohammed Arif: ప్రాణదాతపై ‘మూగ’ ప్రేమ!

ABN, First Publish Date - 2023-02-25T02:29:26+05:30

ఆపదలో ఆదుకునేవారిని గుర్తుపెట్టుకుంటాం.. మళ్లీ ఎక్కడైనా తారసపడితే ఆప్యాయంగా మాట్లాడతాం.. తప్ప ఇంకేం చేయగలం? అదే సాయం పొందింది ఓ పక్షి అయితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ, ఫిబ్రవరి 24: ఆపదలో ఆదుకునేవారిని గుర్తుపెట్టుకుంటాం.. మళ్లీ ఎక్కడైనా తారసపడితే ఆప్యాయంగా మాట్లాడతాం.. తప్ప ఇంకేం చేయగలం? అదే సాయం పొందింది ఓ పక్షి అయితే.. బహుశా ‘బచ్చా’ అనే ఆ నీటి కొంగ మాదిరిగా ఎప్పుడూ మన వెన్నంటే ఉంటుందేమో! యూపీ అమేఠీ సమీపంలోని మండ్కా గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహ్మద్‌ ఆరిఫ్‌ హార్వెస్టింగ్‌ డ్రైవర్‌. ఏడాది క్రితం.. 5 ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల రెక్కలతో ఉన్న ఓ భారీ నీటి కొంగ గాయాలతో పొలంలో పడివుండగా చూశాడు. దగ్గరకు వెళ్లి చూడగా దాని కాలి నుంచి రక్తం కారుతోంది. దాన్ని ఇంటికి తీసుకెళ్లి. కాలికి మందు రాసి.. పక్షి నిలబడేలా దాపుగా కాలికి ఓ వెదురు బొంగును కట్టాడు. ఇంటి ప్రాంగణంలోని రేకుల షెడ్డులో ఆ కొంగను ఉంచాడు. కొన్నాళ్లకు అది కోలుకోవడంతో కాలికి కట్లన్నీ తొలగించాడు! అయితే ఆ కొంగ ఆరి్‌ఫను, ఆ ఇంటిని వదిలి వెళ్లలేదు. తన ఉపాధిలో భాగంగా ఆరిఫ్‌ రోజూ తన బైక్‌ మీద 40-50 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాడు. ఆరిఫ్‌ బైక్‌ మీద వెళుతుంటే.. ఆ కొంగ గాల్లో ఎగురుతూ అతడినే అనుసరిస్తోంది! ఆరిఫ్‌ తన షెడ్డులోకి రాగానే అతడిని ఆప్యాయంగా రెక్కలతో నిమురుతుంది! ఆ కొంగకు ముద్దుగా ‘బచ్చా’ అని పేరు పెట్టాడతను.

Updated Date - 2023-02-25T11:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising