ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: మాజీ ముఖ్యమంత్రి ఇంటికే మందులను పంపుతాం..

ABN, First Publish Date - 2023-02-02T08:41:14+05:30

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొరత ఉన్న మందుల వివరాలను మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వెల్లడిస్తే, ఆ మందులను ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఆరోగ్య మంత్రి సుబ్రమణ్యం

అడయార్‌(చెన్నై), ఫిబ్రవరి 1: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొరత ఉన్న మందుల వివరాలను మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వెల్లడిస్తే, ఆ మందులను ఆయన ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) తెలిపారు. ఈరోడ్‌ తూర్పు స్థానానికి జరిగే ఉప ఎన్నిక కోసం స్థానికంగా ఎన్నికల కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర మందుల కొరత ఉందని ఓపీఎస్‌(OPS) అంటున్నారని, ఏయే మందులు కొరత ఉందో ఆయన వెల్లడించాలన్నారు.ఆయన దగ్గర ఆధారాలుంటే ఏ ఆస్పత్రిలో మందులు లేవో వెల్లడిస్తే అక్కడకు తక్షణం మందులు చేరవేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎసెన్షియల్‌ ట్రాక్‌ పేరుతో పిలిచే 300కు పైగా మందులు అన్ని ఆస్పత్రుల్లో పుష్కలంగా ఉన్నాయ్నారు.ఎక్కడైనా మందులకొరత ఉంటే తక్షణం 104కు ఫోన్‌చేసి తెలపాలన్నారు.డాక్టర్‌ ఎంజీఆర్‌ తమిళనాడు ప్రభుత్వవైద్య విశ్వవిద్యాలయానికి డీన్‌ను ఎందుకు నియమించలేదో ఓపీఎస్‌ వెళ్ళి గవర్నర్‌ను ప్రశ్నించాలన్నారు.పైగా డీన్‌ను నియమించే అధికారం గవర్నర్‌కే ఉందని మంత్రి సుబ్రహ్మణ్యం గుర్తు చేశారు.

Updated Date - 2023-02-02T08:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising