ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur violence : నగ్నంగా ఇద్దరు మహిళల ఊరేగింపు కేసు.. ఐదో నిందితుడిని అరెస్ట్ చేసిన మణిపూర్‌ పోలీసులు..

ABN, First Publish Date - 2023-07-22T11:52:20+05:30

దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలను సృష్టించిన మణిపూర్ సంఘటనలో ఐదో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అరెస్టయిన నలుగురిని 11 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు శుక్రవారం ఆదేశించింది. మే 3 నుంచి ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈ రాష్ట్రంలో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలను సృష్టించిన మణిపూర్ సంఘటనలో ఐదో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం అరెస్టయిన నలుగురిని 11 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు శుక్రవారం ఆదేశించింది. మే 3 నుంచి ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈ రాష్ట్రంలో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇది అత్యంత అమానుషమైన సంఘటన అని, ఇది దేశానికి అవమానకరమని, దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ చెప్పారు.

మణిపూర్‌లోని కంగ్పోక్పి జిల్లాలో మే 4న ఈ అమానుష దాడి జరిగినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడవుతోంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్వీయ విచారణ జరుపుతోంది. జాతీయ మహిళా కమిషన్ గతంలోనే స్పందించినప్పటికీ, మణిపూర్ పోలీసులు సమాధానం చెప్పలేదని తెలుస్తోంది.

ఈ కేసులో ఐదో నిందితుడు యుమ్లెంబమ్ నుంగ్సితోయ్ (19)ని పోలీసులు అరెస్టు చేశారు. వదంతులను నమ్మవద్దని ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. నిరాధారమైన ఆరోపణలతో విడుదలయ్యే వీడియోల గురించి యథార్థాలను తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్ నంబరు 9233522822కు ఫోన్ చేయాలని తెలిపింది. దొంగతనంగా పట్టుకెళ్లిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను తిరిగి పోలీసులకు, భద్రతా సిబ్బందికి అప్పగించాలని ప్రజలను కోరింది.

ఘరి ప్రాంతంలో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మెయిన్ రోడ్డును దిగ్బంధనం చేసి, టైర్లను తగులబెట్టారు. దీంతో ఇంఫాల్‌లో హింసాకాండ మళ్లీ ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి :

HD Kumaraswamy : కర్ణాటక ప్రయోజనాల కోసం జేడీఎస్ కీలక నిర్ణయం

Shiv Sena and BJP : మహారాష్ట్ర సీఎం షిండే ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. అజిత్ పవార్ చేరికతో ముసలం మొదలైందా?..

Updated Date - 2023-07-22T11:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising