HD Kumaraswamy : కర్ణాటక ప్రయోజనాల కోసం జేడీఎస్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-07-22T09:16:28+05:30 IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమార స్వామి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి ఓ ప్రతిపక్షంగా పని చేయాలని తమ పార్టీ నిర్ణయించుకుందని చెప్పారు. పార్టీకి సంబంధించిన తుది నిర్ణయం తీసుకునేందుకు తమ పార్టీ అధినేత హెచ్‌డీ దేవె గౌడ తనకు అధికారం ఇచ్చారని తెలిపారు.

HD Kumaraswamy : కర్ణాటక ప్రయోజనాల కోసం జేడీఎస్ కీలక నిర్ణయం
HD Kumaraswamy, Narendra Modi

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమార స్వామి (HD Kumaraswamy) శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి ఓ ప్రతిపక్షంగా పని చేయాలని తమ పార్టీ నిర్ణయించుకుందని చెప్పారు. పార్టీకి సంబంధించిన తుది నిర్ణయం తీసుకునేందుకు తమ పార్టీ అధినేత, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవె గౌడ తనకు అధికారం ఇచ్చారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల గురించి మాట్లాడటానికి ఇంకా సమయం ఉందని చెప్పారు.

2024 లోక్ సభ ఎన్నికల కోసం ఎన్డీయేతో జేడీఎస్ కలిసే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో జేడీఎస్ శాసన సభా పక్ష సమావేశం గురువారం రాత్రి జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాల గురించి విలేకర్లు అడిగినపుడు కుమార స్వామి స్పందిస్తూ, పార్లమెంటు ఎన్నికల గురించి మాట్లాడటానికి ఇంకా సమయం ఉందని చెప్పారు. పార్టీకి సంబంధించిన తుది నిర్ణయం తీసుకునేందుకు తమ పార్టీ అధినేత, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవె గౌడ తనకు అధికారం ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి ఓ ప్రతిపక్షంగా పని చేయాలని తమ పార్టీ నిర్ణయించుకుందని చెప్పారు.

బీజేపీ, జేడీఎస్ ప్రతిపక్ష పార్టీలని తాను ఇప్పటికే శాసన సభలోనూ, బయట చెప్పానని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై శుక్రవారం ఉదయం కూడా తన పార్టీ ఎమ్మెల్యేలు చర్చించారని చెప్పారు.

జేడీఎస్ శాసన సభా పక్షం సమావేశంలో దేవె గౌడ మాట్లాడుతూ, నేతలందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత 10 మంది సభ్యులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలకు ఈ బృందంలో స్థానం కల్పించాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులపై గళమెత్తాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని (31) జిల్లాల్లోనూ ప్రభుత్వంపై గళమెత్తాలని తెలిపారు.

మే నెలలో జరిగిన కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో 224 స్థానాలకుగానూ కాంగ్రెస్‌కు 135, బీజేపీకి 65, జేడీఎస్‌కు 19 స్థానాలు లభించాయి. కుమార స్వామి చన్నపట్న నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సీపీ యోగేశ్వరపై 15,915 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

ఇవి కూడా చదవండి :

Terrorist Pannun : అమిత్ షా, జైశంకర్‌లకు ఖలిస్థానీ ఉగ్రవాది పన్నున్ బెదిరింపులు

Chennai: రూ.1000 పథకానికి అద్దె ఇళ్లలోని గృహిణులూ అర్హులే..

Updated Date - 2023-07-22T09:16:28+05:30 IST