Lighthouse: లైట్‌హౌస్ పైకి పర్యాటకుల అనుమతి
ABN, First Publish Date - 2023-01-14T09:39:18+05:30
కన్నియాకుమారి లైట్‌హౌస్(Lighthouse) పైకి శుక్రవారం నుంచి పర్యాటకులను అనుమతించనున్నారు. ఇటీవల లైట్ హౌస్ పైకి వెళ్లేలా రూ
పెరంబూర్(చెన్నై): కన్నియాకుమారి లైట్‌హౌస్(Lighthouse) పైకి శుక్రవారం నుంచి పర్యాటకులను అనుమతించనున్నారు. ఇటీవల లైట్ హౌస్ పైకి వెళ్లేలా రూ.1.85 కోట్ల వ్యయంతో అద్దాలతో కూడిన లిఫ్ట్ ఏర్పాటుచేశారు. పనులు ముగియడంతో లైట్‌హౌస్ పైకి పర్యాటకులను అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటలు, శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అనుమతించనున్నామన్నారు. పెద్దలకు రూ.10, చిన్నారులకు రూ.5, కెమెరా తీసుకెళ్లేందుకు రూ.20 రుసుముగా నిర్ణయించినట్లు అధికారులు తెలియజేశారు.
Updated Date - 2023-01-14T09:39:19+05:30 IST