ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యూపీ బడి పుస్తకాల్లో సావర్కర్‌పై పాఠాలు

ABN, First Publish Date - 2023-06-26T01:02:56+05:30

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నూతనంగా ముద్రించనున్న పాఠ్యపుస్తకాల్లో హిందుత్వ సిద్ధాంతకర్త వి.డి.సావర్కర్‌, భారతీయ జన సంఘ్‌ పార్టీ నాయకుడు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌లకు చోటు కల్పించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ, జూన్‌ 25: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నూతనంగా ముద్రించనున్న పాఠ్యపుస్తకాల్లో హిందుత్వ సిద్ధాంతకర్త వి.డి.సావర్కర్‌, భారతీయ జన సంఘ్‌ పార్టీ నాయకుడు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌లకు చోటు కల్పించారు. 9వ తరగతి పుస్తకంలో సావర్కర్‌పై, 11వ తరగతి పాఠ్య పుస్తకంలో ఉపాధ్యాయ్‌పై పాఠాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ, తిలక్‌, అంబేడ్కర్‌ సహా మొత్తం 50 మంది ప్రముఖులపై పాఠాలను రూపొందించారు. మోరల్‌ ఎడ్యుకేషన్‌ సబ్జెక్టు కింద వీటిని బోధిస్తారు. కంపల్సరీ సబ్జెక్టులో భాగంగా విద్యార్థులు వీటిని తప్పకుండా చదవాల్సి ఉంటుంది. ప్రముఖల జీవితాలపై పాఠాలను రూపొందిస్తామని 2022 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. దాన్ని ప్రస్తుతం అమలు చేసినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. స్వాతంత్ర్యోద్యమంలో సావర్కర్‌, ఉపాధ్యాయుల పాత్ర ఏమిటని ప్రశ్నించాయి. ఇది విద్యాపరమైన అవినీతి అని సమాజ్‌వాదీ పార్టీ వ్యాఖ్యానించింది.

Updated Date - 2023-06-26T01:02:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising