ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India Lockdown: దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్.. ఎందుకంటే..?

ABN, First Publish Date - 2023-09-16T19:38:10+05:30

కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవం కారణంగా.. 2020, 2021లో యావత్ ప్రపంచం స్తంభించిపోయిన విషయం అందరికీ గుర్తుంటే ఉంటుంది. బహుశా ఈ తరం వాళ్లు ఈ కరోనా లాక్‌డౌన్ కాలాన్ని...

కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవం కారణంగా.. 2020, 2021లో యావత్ ప్రపంచం స్తంభించిపోయిన విషయం అందరికీ గుర్తుంటే ఉంటుంది. బహుశా ఈ తరం వాళ్లు ఈ కరోనా లాక్‌డౌన్ కాలాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. విస్తృతంగా కరోనా కేసులు, మరణాలు సంభవించడం వల్ల.. ప్రపంచ దేశాలతో పాటు భారత ప్రభుత్వం సైతం దేశంలో లాక్‌డౌన్ విధించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గాను.. దేశంలో రెండుసార్లు లాక్‌డౌన్‌ని అమలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే.. దేశంలో మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి ఇందుకు కారణం కరోనా వైరస్ కాదు.. అంతకంటే ప్రాణాంతకమైన నిపా వైరస్.


ప్రస్తుతం ఈ నిపా వైరస్ కేరళ రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందగా.. మరికొంతమంది దీని బారిన పడ్డారు. ఈ నిపా వైరస్‌కి వ్యాక్సిన్ లేకపోవడం, ఎలాంటి చికిత్స అందుబాటులో లేకపోవడంతో.. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేరళలో అప్పుడే ఆంక్షలు విధించారు. వారం రోజుల పాటు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. అంతేకాదు.. రద్దీగా ఉండే ప్రాంతాలైన షాపింగ్ మాల్స్, థియేటర్లపై కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు.. కోజికోడ్ జిల్లాలో హైఅలర్ట్ కొనసాగుతోంది. చాలా చోట్లా లాక్‌డౌన్ విధించడంతో పాటు ప్రజల కదలికలనూ తగ్గించారు. పాఠశాలల్ని 24వ తేదీ వరకూ మూసివేయాలని నిర్ణయించారు.

మరోవైపు.. ఈ నిపా వైరస్ కోవిడ్ కన్నా చాలా ప్రమాదకరమైనదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హెచ్చరించింది. కొవిడ్ సోకిన వారిలో మరణాల రేటు 2-3 శాతం మాత్రమే ఉంటే.. నిపా సోకిన వారిలో మరణాల రేటు 40-70 శాతం మధ్య ఉంటుందని ఆ రీసెర్చ్ వెల్లడించింది. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలని ఆ రీసెర్చ్ వాళ్లు సూచిస్తున్నారు. ఒకవేళ ఈ వైరస్ గనుక కేరళ నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యాప్తి చెందితే.. అప్పుడు పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. కరోనాతో పోలిస్తే దీని మరణాల రేటు అధికంగా ఉంటుంది కాబట్టి.. అప్పుడు దీని వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ తప్ప మరే ఇతర ఉత్తమ మార్గం ఉండదు.

Updated Date - 2023-09-16T19:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising