ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gnanavapi Masjid : జ్ఞానవాపి మసీదులో సర్వే చేయొచ్చు

ABN, First Publish Date - 2023-08-04T03:18:16+05:30

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు అనుమతిచ్చింది. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎ్‌సఐ) నిపుణులు శుక్రవారం నుంచి ఈ సర్వేను ప్రారంభించనున్నారు.

వారాణసీ జిల్లా కోర్టు తీర్పు

సరైనది, సముచితమైనది

అందులో జోక్యం

చేసుకోవాల్సిన అవసరం లేదు

సర్వేలో భాగంగా మసీదు

ప్రాంగణంలో తవ్వకాలు వద్దు

అలహాబాద్‌ హైకోర్టు తీర్పు..

సుప్రీంకు మసీదు కమిటీ

వెంటనే పరిశీలిస్తానన్న సీజేఐ

ప్రయాగరాజ్‌, వారాణసీ, న్యూఢిల్లీ, ఆగస్టు 3: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు అనుమతిచ్చింది. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎ్‌సఐ) నిపుణులు శుక్రవారం నుంచి ఈ సర్వేను ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథుడి ఆలయానికి పక్కనే ఉన్న ఈ మసీదును.. హిందూ ఆలయం స్థానంలో నిర్మించారని, శాస్త్రీయ సర్వే నిర్వహించి ఈ విషయాన్ని తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు వారాణసీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దానిపై విచారణ నిర్వహించిన కోర్టు సర్వే చేపట్టాలని జూలై 21న ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు జూలై 24న ఏఎ్‌సఐ అధికారుల బృందం సర్వే ప్రారంభించింది. అయితే, దీనిపై మసీదు కమిటీ జూలై 25న సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం సర్వే నిర్వహణపై జూలై 26 సాయంత్రం 5 గంటల దాకా స్టే విధించి, వారాణసీ కోర్టు తీర్పుపై అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.


సుప్రీం సూచన మేరకు మసీదు కమిటీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఇరు వర్గాల వాదనలూ విన్న హైకోర్టు సర్వేకు అనుమతిస్తూ గురువారం తీర్పునిచ్చింది. సర్వే నిర్వహించాలన్న వారాణసీ జిల్లా కోర్టు తీర్పు సరైనది, సముచితమైనది అని.. దాంట్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరమేమీ లేదని స్పష్టం చేస్తూ మసీదు కమిటీ పిటిషన్‌ను కొట్టేసింది. విచారణ సమయంలో మసీదు కమిటీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ఎస్‌ఎ్‌ఫఏ నక్వీ.. ఏఎ్‌సఐ అధికారులు మసీదు ప్రాంగణం వద్దకు తీసుకొచ్చిన డిగ్గింగ్‌ ఎక్వి్‌పమెంట్‌ (తవ్వడానికి ఉపయోగించే పరికరాల) ఫొటోలను కోర్టుకు సమర్పించారు. అక్కడ తవ్వకాలు జరిపే ఆలోచన ఏఎ్‌సఐకి ఉందని తెలిపారు. దీనికి అలహాబాద్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ దివాకర్‌ స్పందిస్తూ.. సర్వేలో భాగంగా ఎలాంటి తవ్వకాలూ జరపరాదని నొక్కిచెప్పారు. కాగా, సర్వే పై జిల్లా కోర్టు తీర్పు తక్షణమే అమల్లోకి వస్తుందని హైకోర్టు చెప్పినట్టు హిందువుల తరఫు న్యాయవాది విష్ణుశంకర్‌ జైన్‌ తెలిపారు.

మళ్లీ సుప్రీంకు..

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఏఎ్‌సఐ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే మసీదు కమిటీ తరఫు న్యాయవాది నిజాం పాషా.. ఆర్టికల్‌ 370కి సంబంధించిన కేసులపై విచారణ జరుపుతున్న సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు రాజ్యాంగ ధర్మాసనం వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించారు. హైకోర్టు తీర్పుపై తాము స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలుచేశామని.. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ తాను ఈమెయిల్‌ పంపానని.. సర్వే జరగకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సీజేఐ.. తాను వెంటనే ఆ ఈమెయిల్‌ను చూస్తానని చెప్పారు. కాగా.. హైకోర్టు తీర్పు నేపథ్యంలో మసీ దు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాల్సిందిగా కోరుతూ హిందూ పిటిషనర్లు కేవియట్‌ దాఖలు చేశారు.

అది బౌద్ధారామం అంటూ పిటిషన్‌

జ్ఞానవాపి కేసులో కొత్త ట్విస్టు. హిందువులు, ముస్లింలు వాదిస్తున్నట్టు అది మందిరమో, మసీదో కాదని.. అదో బౌద్ధారామమని, దీన్ని నిరూపించడానికి ఏఎ్‌సఐ సర్వే జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారో బౌద్ధగురువు. ఆయన పేరు గురు సుమిత్‌ రతన్‌ భాంటే.

Updated Date - 2023-08-04T03:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising