ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Helicopter: కోవై నుంచి ఊటీకి హెలికాఫ్టర్‌ సేవలు

ABN, First Publish Date - 2023-01-26T09:06:21+05:30

పరిశ్రమల నగరమైన కోయంబత్తూరు నుంచి ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నీలగిరి జిల్లా ఊటీకి హెలికాఫ్టర్‌(Helicopter) ఏర్పాటు దిశగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల నగరమైన కోయంబత్తూరు నుంచి ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నీలగిరి జిల్లా ఊటీకి హెలికాఫ్టర్‌(Helicopter) ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు పలు ప్రైవేటు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోంది. అది సఫలమైతే త్వరలో ఈ రెండు ప్రాంతాల మధ్య హెలికాఫ్టర్‌ ప్రయాణం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కె.రామచంద్రన్‌ ఊటీలో విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రైవేటు కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్న మాట వాస్తవమేనని తెలిపారు. హెలికాఫ్ట్టర్‌ సర్వీసుకు అవసరమైన అనుమతులు కూడా కేంద్రం నుంచి పొందాల్సివుందన్నారు. ఈ ఏడాది వాల్పారై నుంచి ఏర్కాడుకు హెలికాఫ్టర్‌ సర్వీస్‌ నడపనున్నట్లు వివరించారు. ఊటీ(Ooty) సరస్సు, బోట్‌హౌస్‌, పైకారా సరస్సు తదితరాల వద్ద మరిన్ని సదుపాయాలు కల్పించనున్నామన్నారు. ఊటీ సరస్సులో బోట్‌హౌస్‌ ఏర్పాటు చేయనున్నామన్నారు. పర్యాటకులు అందులో కూర్చుని అల్పాహారం, లేదా మధ్యాహ్న భోజనం తినేలా సదుపాయాలు కల్పించనున్నామన్నారు. అదే విధంగా 30 మంది పర్యాటకులుంటే సాయంత్రం వేళల్లో జన్మదినోత్సవాలు, ఇతర శుభకార్యక్రమాల కోసం బోట్‌లు అద్దెకిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు.

Updated Date - 2023-01-26T09:06:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising