2000 Notes: 2000 నోట్లపై మరో కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..!
ABN, First Publish Date - 2023-06-08T15:24:53+05:30
ఈ ఏడాది మే 19న ఆర్బీఐ 2వేల నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ 2వేల నోట్ల డిపాజిట్లపై కీలక ప్రకటన చేశారు. గడిచిన 20 రోజుల్లో 2వేల నోట్ల డిపాజిట్ గణనీయంగా పెరిగిందని వెల్లడించింది.
ఈ ఏడాది మే 19న ఆర్బీఐ(RBI) 2వేల నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసింది. 2వేలనోట్ల మార్పడికి (2000 Notes Exchange) సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. తాజాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్(RBI Governor Shaktikanta Das) 2వేల నోట్ల డిపాజిట్లపై కీలక ప్రకటన చేశారు. బ్యాంకుల్లో 2వేల నోట్ల డిపాజిట్లపై వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్న ఆర్బీఐ.. గడిచిన 20 రోజుల్లో 2వేల నోట్ల డిపాజిట్ గణనీయంగా పెరిగిందని వెల్లడించింది. కేవలం మూడు వారాల్లోనే 50 శాతం నోట్లు డిపాజిట్(Deposite) అయినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఇప్పటివరకు మొత్తం చెలామణిలో ఉన్న 2వేల నోట్లలో 85శాతం బ్యాంకు డిపాజిట్లుగా తిరిగి వచ్చినట్లు శక్తికాంత దాస్ ప్రకటించారు.
కాగా మార్చి 31 వరకు రూ.3.62 లక్షల కోట్ల విలువైన చలామణిలో ఉనన 2వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయినట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. చివరి మూవ్‌మెంట్‌లో రద్దీని తగ్గించేందుకు ప్రజలు ముందుగానే 2వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆయన విజ్ఒప్తి చేశారు. ఇందుకు తగ్గట్టుగా సెంట్రల్ బ్యాంకు కరెన్సీ కలిగి వుందన శక్తికాంత్ దాస్ తెలిపారు.
కాగా.. ఉపసంహరణకు ముందే చెలామణిలో ఉన్న 2వేల నోట్ల సంఖ్య గణనీయంగా 46 శాతం తగ్గిందని శక్తికాంత్ దాస్ తెలిపారు. 2018 మార్చి 31 వరకు మొత్తం 6.73 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు చెలామణిలో ఉండగా..3.62 లక్షల కోట్లకు తగ్గింది. మార్చి నెలలో చెలామణిలో ఉన్న నోట్లు కేవలం 10.8 శాతం మాత్రమేనని శక్తికాంత్ దాస్ తెలిపారు.
Updated Date - 2023-06-08T15:33:06+05:30 IST