ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధులకు 2 శుభవార్తలు

ABN, First Publish Date - 2023-02-02T02:15:53+05:30

ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఈ బడ్జెట్‌లో వృద్ధులకు రెండు శుభవార్తలు వినిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఈ బడ్జెట్‌లో వృద్ధులకు రెండు శుభవార్తలు వినిపించారు. ఒకటి.. ‘సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎ్‌సఎ్‌స)’లో పెట్టుబడి పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. పదవీ విరమణ చేసినప్పుడు పెద్ద ఎత్తున వచ్చే సొమ్మును బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే.. అవి ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి ఇవ్వలేవు. అందుకే, ప్రభుత్వం వారికి నష్టభయం లేకుండా ఆకర్షణీయమైన వడ్డీ (ప్రస్తుతం 8 శాతంగా ఉంది) వచ్చేలా ఈ పథకాన్ని రూపొందించింది. దీంతో, సాధారణంగా సీనియర్‌ సిటిజన్లు ఈ పథకంలోనే పెడుతుంటారు. ఇది ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి పథకం కాబట్టి.. నష్టభయం ఉండదనే ధీమా వారికి ఉంటుంది. దానికితోడు, ఈ పథకం కింద వారికి ఆకర్షణీయమైన వడ్డీ (ప్రస్తుతం ఏడాదికి 8 శాతంగా ఉంది) వస్తుంది. ఈ పథకం కాలపరిమితి ఐదు సంవత్సరాలు. ఆ తర్వాత మరో మూడేళ్ల దాకా పొడిగించుకోవచ్చు. ఇక రెండో శుభవార్త.. వృద్ధులకు ప్రతినెలా ఆదాయ హామీనిచ్చే పోస్టాఫీస్‌ నెలవారీ ఆదాయ పథకంలో పెట్టు పెట్టుబడుల పరిమితిని కూడా పెంచారు. సింగిల్‌ ఖాతాపై ప్రస్తుతం ఉన్న రూ.4.5 లక్షల పరిమితిని రూ.9 లక్షలకు, ఉమ్మడి ఖాతా పరిమితిని రూ.9 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచుతున్నట్టు నిర్మల ప్రకటించారు. ఎస్‌సీఎ్‌సఎ్‌సలాగానే ఇది కూడా వృద్ధులు అత్యంత సురక్షితంగా భావించే పెట్టుబడి పథకం.

Updated Date - 2023-02-02T02:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising