జీ20 నాయకత్వంతో భారత్‌కు మేలు!
ABN, First Publish Date - 2023-09-04T02:14:58+05:30
జీ20 నాయకత్వ బాధ్యతలు భారత్‌కు బాగా కలిసొస్తాయా? ఆర్థికంగా మేలు చేస్తాయా? వాణిజ్యపరమైన బంధాలు బలోపేతమవుతాయా? అంటే నిపుణులు అవుననే అంటున్నారు.
సభ్య దేశాలతో వాణిజ్య బంధాలు బలోపేతం: నిపుణులు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 3: జీ20 నాయకత్వ బాధ్యతలు భారత్‌కు బాగా కలిసొస్తాయా? ఆర్థికంగా మేలు చేస్తాయా? వాణిజ్యపరమైన బంధాలు బలోపేతమవుతాయా? అంటే నిపుణులు అవుననే అంటున్నారు. జీ20కి నాయకత్వ బాధ్యతలు చేపట్టిన భారత్‌కు.. సభ్య దేశాలతో వాణిజ్య బంధాలను బలోపేతం చేసుకునే అవకాశం లభించిందని పేర్కొంటున్నారు. జీ20 సభ్య దేశాల నుంచి మౌలిక సదుపాయాల వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులను ఆకర్షించే చక్కటి అవకాశం దొరికినట్లయిందని చెబుతున్నారు. జీ20 సభ్య దేశాల జీడీపీ.. అంతర్జాతీయ జీడీపీలో 85ు, అంతర్జాతీయ వాణిజ్యంలో 75ు, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు సభ్య దేశాల్లోనే ఉంటుంది. ఇంతటి విశిష్టత కలిగిన జీ20 వేదిక.. భారత్‌కు లభించిన గొప్ప అవకాశమని నిపుణులు చెబుతున్నారు. దేశం తన సత్తాను, సాధించిన విజయాలను చూపి ఆయా దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇదో సువర్ణావకాశమని పేర్కొంటున్నారు.
తృణధాన్యాలతో పసందైన వంటకాలు..
ఈ నెల 9న ఢిల్లీలోని పూసా క్యాంప్‌సలో జీ20 సభ్య దేశాధినేతల సతీమణుల కోసం భారతదేశ వ్యవసాయ వారసత్వ విలువలను తెలియజేసేలా వినూత్న కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రముఖ పాకశాస్త్ర నిపుణులతో అప్పటికప్పుడు తృణధాన్యాలతో వంటకాలు చేయించి, ఆయా దేశాల ప్రథమ మహిళలు, దేశాధినేతల భాగస్వాములకు రుచి చూపించనున్నారు. వారి కోసం ప్రత్యేకంగా వ్యవసాయ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే కొందరు ప్రత్యేక అతిథుల కోసం మిల్లెట్స్ రంగోలి ఏర్పాటు చేస్తున్నారు.
Updated Date - 2023-09-04T02:16:09+05:30 IST