ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gandhi peace prize row : రూ.కోటి అవార్డు సొమ్ము నిరాకరించిన గీతాప్రెస్

ABN, First Publish Date - 2023-06-19T15:34:21+05:30

జాతిపిత మహాత్మాగాంధీ పేరిట ఏటా అందజేసే గాంధీ శాంతి పురస్కారానికి 2021 సంత్సరానికి గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత గీతాప్రెస్ ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడంపై ఓ వైపు హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు వివాదం చోటుచేసుకోవడంపై గీతాప్రెస్ స్పందించింది. ఈ అవార్డు కింద ఇచ్చే కోటి రూపాయల అవార్డును నిరాకరిస్తున్నట్టు తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ పేరిట ఏటా అందజేసే గాంధీ శాంతి పురస్కారానికి (Gandhi Peace Prize) 2021 సంత్సరానికి గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత గీతాప్రెస్ (Gita press)ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడంపై ఓ వైపు హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, మరోవైపు వివాదం చోటుచేసుకోవడంపై గీతాప్రెస్ స్పందించింది. ఈ అవార్డు కింద ఇచ్చే కోటి రూపాయల (RS.1 crore) అవార్డును నిరాకరిస్తున్నట్టు తెలిపింది. జ్ఞాపికను మాత్రమే తాము స్వీకరిస్తామని, అవార్డు సొమ్మును వేరే అవసరాలకు ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చని గీతాప్రెస్ పబ్లిషర్స్ తెలిపారు.

అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం చేసిన విశేష కృషికి గీతాప్రెస్ ప్రచురణ సంస్థను గాంధీ శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆదివారంనాడు ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని జ్యూరీ ఈ పురస్కారానికి గీతాప్రెస్‌ను ఎంపిక చేసింది. గీతాప్రెస్ స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ పురస్కారానికి ఎంపిక కావడం సామాజిక సేవలో ఆ సంస్థ చేసిన కృషికి గుర్తింపు అని ప్రధాని మోదీ ఓ ట్వీట్‌లో గీతాప్రెస్‌కు అభినందనలు తెలిపాయి.

కాంగ్రెస్ విమర్శ...

కాగా, గీతాప్రెస్‌ను గాంధీకి శాంతి బహుమతికి ఎంపిక చేయడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. గీతాప్రెస్‌ను ఎంపిక చేయడం సావర్కర్, గాడ్సేను ఎంపిక చేసిన తరహాలో ఉందని, ఇదొక అపహాస్యమైన నిర్ణయంగా అభివర్ణించింది.

గీతాప్రెస్ ఆర్థిక ఇబ్బందులు..!

1923లో ప్రారంభమైన గీతాప్రెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. 14 బాషల్లో 41.7 కోట్లకు పైగా పుస్తకాలను ప్రచురించిన రికార్డు సొంతం చేసుకుంది. వీటిలో 16.21 కోట్లు భగవద్గీత పుస్తకాలే ఉన్నాయి. లాభాపేక్ష కోసం కానీ, ఆదాయం కోసం అడ్వర్‌టైజ్‌మెంట్లను ఆశ్రయించడం కానీ ఏనాడూ చేయని సంస్థగా పేరుతెచ్చుకుంది. కొద్ది కాలం క్రితం ఆర్థిక భారం కారణంగా గీతాప్రెస్ మూతబడనుందనే వార్తలు వచ్చాయి. గీతాప్రెస్‌ సేవలు అమూల్యమని, అది మూతపడకుండా కేంద్రం ఆదుకోవాలంటూ విజ్ఞప్తులు కూడా వచ్చాయి. ఈ క్రమంలో తమ గీతాప్రెస్ మూతపడటం లేదంటూ ఆ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో గాంధీ శాంతి బహుమతి ద్వారా వచ్చే రూ.కోటి రూపాయలు సంస్థ పురోగతికి ఊతం అవుతుందనే అభిప్రాయాలు తాజాగా వ్యక్తమయ్యాయి. అయితే, అవార్డుకు గీతాప్రెస్‌ను ఎంపిక చేయడం వివాదానికి దారితీయడంతో గీతాప్రెస్ ప్రబ్లిషర్స్ మరోసారి ముందుకు వచ్చారు. కోటి రూపాయల పురస్కారాన్ని సున్నింతంగా నిరాకరిస్తున్నట్టు ప్రకటించారు. జ్ఞాపికను తీసుకుంటామని, అవార్డు సొమ్ము కేంద్రం వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకోవచ్చని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంద

Updated Date - 2023-06-19T15:38:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising