ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

JOYAL : చైనాతో ‘ఘమండియా’ మిలాఖత్‌!

ABN, First Publish Date - 2023-08-09T03:38:50+05:30

విపక్షాలు చైనాతో మిలాఖతై దేశ భద్రత, ఐక్యత, సమగ్రతలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని కేంద్రమంత్రి, రాజ్యసభలో అధికారపక్ష నేత పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు.

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఆరోపణలు

న్యూఢిల్లీ, ఆగస్టు 8: విపక్షాలు చైనాతో మిలాఖతై దేశ భద్రత, ఐక్యత, సమగ్రతలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని కేంద్రమంత్రి, రాజ్యసభలో అధికారపక్ష నేత పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు. పరస్పర ప్రయోజనాల కోసమే ఈ పార్టీలు ఒక్కటై ‘ఘమండియా’ (అహంకారపూరిత) కూటమిగా ఏర్పడ్డాయని విమర్శించారు. న్యూస్‌క్లిక్‌ వెబ్‌సైట్‌కు చైనా నిధులు పంపించటాన్ని న్యూయార్క్‌టైమ్స్‌ కథనం వెలుగులోకి తేవటంతో విపక్షాల బండారం బయటపడిందన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం అంశాన్ని బీజేపీ ఎంపీ సుదాంశు త్రివేది రాజ్యసభలో లేవనెత్తిన నేపథ్యంలో మంగళవారం విలేకర్లతో పీయూష్‌ గోయల్‌ మాట్లాడారు. న్యూస్‌క్లిక్‌ అంశం చాలా తీవ్రమైనదని, ప్రజాస్వామ్యం, పత్రికాస్వేచ్ఛ గురించి మాట్లాడే వారి చిత్తశుద్ధి పట్ల ఇది పలు సందేహాలను లేవనెత్తుతోందని గోయల్‌ అన్నారు. గోయల్‌ వ్యాఖ్యలపై విపక్ష కూటమి-ఇండియా నేతలు రాజ్యసభ చైర్మన్‌కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. గోయల్‌ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-08-09T03:39:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising