ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former Minister: చిక్కుల్లో మాజీ మంత్రి

ABN, First Publish Date - 2023-01-07T11:57:09+05:30

కాంట్రాక్టర్‌ సంతోష్‌ ఆత్మహత్య కేసులో మాజీ మంత్రి ఈశ్వరప్ప(Former Minister Eshwarappa)కు మరోసారి చిక్కులు వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కాంట్రాక్టర్‌ సంతోష్‌ ఆత్మహత్య కేసులో బీ రిపోర్టు సాక్ష్యాలు కోరిన కోర్టు

బెంగళూరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టర్‌ సంతోష్‌ ఆత్మహత్య కేసులో మాజీ మంత్రి ఈశ్వరప్ప(Former Minister Eshwarappa)కు మరోసారి చిక్కులు వచ్చాయి. కేసుకు సంబంధించి పోలీసులు సమర్పించిన బీ రిపోర్టు సంపూర్ణ సాక్ష్యాలను తమకు ఇవ్వాలంటూ 42వ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. జనవరి 31లోగా అన్ని సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాలని సూచించింది. బీ రిపోర్టును ప్రశ్నిస్తూ సంతోష్ పాటిల్‌ కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఉడుపిలో సంతోష్‌ పా టిల్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గతంలోనే సంతోష్‌ కుటుంబ సభ్యులు బీ రిపోర్టు సమగ్ర వివరాలు ఇవ్వాలంటూ ఉడిపి పోలీసులను ఆశ్రయించారు. అందుకు వారు ససేమిరా అంటూ దాటవేశారు. దీంతో కోర్టును ఆశ్రయించిన మేరకు నేరుగా ఉడుపి పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అప్పటి మంత్రి ఈశ్వరప్ప పీఏ, కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ మధ్య వాట్సాప్‌ చాట్‌లో బహిర్గతమయింది. దీంతో ఈశ్వరప్పకు మరోసారి సమస్య తప్పదనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే వివాదం నుంచే ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-01-07T12:16:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising