ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former CM: మోదీ, అమిత్‌ షా వందసార్లు వచ్చినా గెలవలేరు

ABN, First Publish Date - 2023-01-15T11:20:16+05:30

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎన్నికల ప్రచారం కోసం వందసార్లు వచ్చినా ఇక్కడ గెలుపు అసాధ్యమని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి

బెంగళూరు, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎన్నికల ప్రచారం కోసం వందసార్లు వచ్చినా ఇక్కడ గెలుపు అసాధ్యమని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి(Former CM Kumaraswamy) ఎద్దేవా చేశారు. శనివారం మీట్‌ ది ప్రెస్‌లో పలు అభిప్రాయాలను ఆయన పంచుకున్నారు. రాష్ట్రంలో జేడీఎస్‌కు ఎంత బలం ఉందో తాము గుర్తించా మని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా 40కుపైగా సీట్లు వస్తాయని, మరో నెలలో ఆ సంఖ్య భారీగా పెరుగుతుందని అన్నారు. గాలి జనార్ధనరెడ్డితో పొత్తు ఉండదన్నారు. సీపీ యోగేశ్వర్‌ ఆడియోపై ప్రాముఖ్యత వృథా అన్నారు. హాసన్‌లో తమ కార్యకర్త పోటీ చేసినా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. హాసన్‌ జిల్లా రాజకీయం రేవణ్ణదే తుది నిర్ణయమన్నారు. జేడీఎస్‌ నాయకులను తయారు చేసే పార్టీ అన్నారు. ఇక్కడనుంచి వెళ్లినవారు ఏఏ పార్టీలో ఏ హోదాలో ఉన్నారో తెలుసుకోవచ్చునన్నారు. మరికొన్ని రోజుల్లోనే 50మంది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు. రిజర్వేషన్ల అంశంపై మఠాధిపతులను రెచ్చగొట్టేలా రాజకీయనేతలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కనీసంగా గుర్తించకపోవడం ఏం లాభమన్నారు. హోం మంత్రి గుజరాత్‌కు వెళ్లి రాగానే శాంట్రో రవిని అరెస్టు చేయడంపై అనుమానం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-01-15T11:20:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising