Ahmadi death : మాజీ సీజేఐ జస్టిస్ అహ్మదీ కన్నుమూత
ABN, First Publish Date - 2023-03-03T02:40:35+05:30
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎం.అహ్మదీ గురువారం ఉదయం ఇక్కడ కన్నుమూశారు. ఆయన 1994 నుంచి 1997 వరకు సీజేఐగా పనిచేశారు.
న్యూఢిల్లీ, మార్చి 2: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎం.అహ్మదీ గురువారం ఉదయం ఇక్కడ కన్నుమూశారు. ఆయన 1994 నుంచి 1997 వరకు సీజేఐగా పనిచేశారు. 1932లో గుజరాత్‌లోని సూరత్‌లో జన్మించిన ఆయన 1957లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1964లో అహ్మదాబాద్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. ఆ స్థాయి నుంచి సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగిన వారు ఆయన ఒక్కరే కావడం విశేషం. ఆయన తండ్రి కూడా సబార్డినేట్ సివిల్ జడ్జిగా పనిచేశారు. జస్టిస్ అహ్మదీ ఒక్క దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రముఖ న్యాయనిపుణునిగా గుర్తింపు పొందారు. అమెరికన్ ఇన్ ఆఫ్ లాస్, లండన్‌లోని మిడిల్ టెంపుల్ ఇన్‌లు ఆయనను గౌరవించాయి.
Updated Date - 2023-03-03T02:40:35+05:30 IST