సినీ నటుడు సచిన్ జోషి తండ్రికి పదేళ్ల జైలు
ABN, First Publish Date - 2023-01-10T03:25:15+05:30
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఓ గుట్కా యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సహకరించిన సినీ నటుడు సచిన్ జోషి తండ్రి జేఎం జోషి, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష పడింది.
ముంబై, జనవరి 9: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఓ గుట్కా యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సహకరించిన సినీ నటుడు సచిన్ జోషి తండ్రి జేఎం జోషి, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష పడింది. గుట్కా ఉత్పత్తిదారుడు జేఎం జోషి, అతని పోటీదారు అయిన రసిక్‌లాల్ ధారివాల్‌కు మధ్య 2002లో వివాదం తలెత్తగా.. జోషి దీని పరిష్కారానికి దావూద్ ఇబ్రహీంను సంప్రదించారు. ఈ వివాదాన్ని పరిష్కరించినందుకు ప్రతిఫలంగా జోషి పాకిస్థాన్‌లో దావూద్ ఇబ్రహీం కోసం ఓ గుట్కా యూనిట్‌ను ఏర్పాటు చేశాడు.
Updated Date - 2023-01-10T03:25:16+05:30 IST