ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

100 శాతం.. సీఎం రేసులో ఉన్నా

ABN, First Publish Date - 2023-03-31T03:44:40+05:30

వంద శాతం తాను కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్దరామయ్య తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కూ సీఎం అవ్వాలనే ఆకాంక్ష ఉండటంపై తనకేమీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శివకుమార్‌కూ ఆకాంక్ష ఉన్నా అభ్యంతరం లేదు

ఇవే నాకు చివరి ఎన్నికలు: సిద్దరామయ్య

బెంగళూరు, మార్చి 30: వంద శాతం తాను కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్దరామయ్య తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కూ సీఎం అవ్వాలనే ఆకాంక్ష ఉండటంపై తనకేమీ అభ్యంతరం లేదన్నారు. మే 10న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మైసూరులోని వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న ఆయన గురువారం ఓ ఆంగ్ల మేగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించేవారిలో తానూ ఉన్నానని ఆయన చెప్పారు. ‘100ు నేనూ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నా. ఆ పదవిని ఆశిస్తున్నవారిలో ఇప్పటికైతే నేనూ, డీకే శివకుమార్‌ ఉన్నాం. జి.పరమేశ్వర గురించి నాకు తెలియదు. గతంలో ఆయన ఆ ఆకాంక్ష వ్యక్తం చేశారు. అందులో తప్పేమీ లేదు’ అన్నారు. డీకే శివకుమార్‌తో తనకున్న సంబంధాల గురించి ప్రశ్నించగా.. ‘కాంగ్రెస్‌ పూర్తి సమైక్యంగా ఉంది. ఆయన కూడా సీఎం పదవి ఆశిస్తున్నారు. అందులో తప్పేమీ లేదు. ఎన్నికైన ఎమ్మెల్యేలు అంతిమంగా శాసనసభాపక్ష నేతను ఎన్నుకొంటారు’ అని వివరించారు. తాను పోటీ చేసే చివరి ఎన్నికలు ఇవే అని కూడా సిద్దరామయ్య పునరుద్ఘాటించారు.

224 స్థానాల్లోనూ ఆప్‌ పోటీ?

ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌) కర్ణాటక ఎన్నికల్లో మొత్తం 224 నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ మేనిఫెస్టోను బుధవారమే విడుదల చేసింది.

Updated Date - 2023-03-31T03:44:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising