ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీలో ఎన్‌కౌంటర్‌.. నేరస్థుడు రషీద్‌ హతం

ABN, First Publish Date - 2023-04-03T01:31:56+05:30

మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా బంధువుల హత్య కేసులో నిందితుడు ఉత్తరప్రదేశ్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ముజఫర్‌నగర్‌ జిల్లా షాపుర్‌ ప్రాంతంలో శనివార ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

క్రికెటర్‌ రైనా బంధువుల హత్య కేసులో నిందితుడు

ముజఫర్‌నగర్‌, ఏప్రిల్‌ 2: మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా బంధువుల హత్య కేసులో నిందితుడు ఉత్తరప్రదేశ్‌ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ముజఫర్‌నగర్‌ జిల్లా షాపుర్‌ ప్రాంతంలో శనివార సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో రషీద్‌ అలియాస్‌ చల్తాఫిర్తా అలియాస్‌ సిపాయి అనే కరడుగట్టిన నేరస్థుడు మరణించాడని పోలీసులు ఆదివారం ప్రకటించారు. 2020 ఆగస్టు 19న పఠాన్‌కోటలో ఉండే రైనా మామ అశోక్‌కుమార్‌ ఇంట్లో రషీద్‌ ముఠా చోరీ చేసింది. రషీద్‌ దాడిలో అశోక్‌కుమార్‌, అతని కొడుకు, అత్త ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఓ బైక్‌పై వెళ్తున్న రషీద్‌ను పోలీసులు వెంబడించగా అతడు కాల్పులకు తెగబడ్డాడు. పోలీసుల ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు.

Updated Date - 2023-04-03T01:31:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising