ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nitesh Rana Resigned: ఈడీ ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ నితేష్‌ రాణా రాజీనామా

ABN, First Publish Date - 2023-03-13T02:54:13+05:30

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసుల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ సంస్థ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న నితేష్‌ రాణా శనివారం తన పదవికి రాజీనామా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వ్యక్తిగత కారణాలతోనేనని వెల్లడి.. కీలక కేసుల్లో వాదనలు

న్యూఢిల్లీ, మార్చి 12: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసుల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ సంస్థ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న నితేష్‌ రాణా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. 44 ఏళ్ల రాణా 2015 నుంచి ఈడీ తరఫున పలు కీలక కేసులను వాదించారు. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ఆయనను ‘లీగల్‌ పవర్‌ లిస్ట్‌ ఆఫ్‌ 2020’కు ఎంపిక చేసింది. వ్యక్తిగత కారణాలే తన రాజీనామాకు కారణమని ఆయన వెల్లడించారు. ఈడీ తదుపరి ఏర్పాట్లు చేసుకునే వరకు అనుసరించే విధానాన్ని తన కార్యాలయం కోర్టుకు వివరిస్తుందని చెప్పారు. ఆయన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం, సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా, కాంగ్రెస్‌ నాయకుడు డి.కె.శివకుమార్‌, ఆర్జేడీ నేత లలూ ప్రసాద్‌ యాదవ్‌, తృణమూల్‌ నేత అభిషేక్‌ బెనర్జీ తదితరులపై నమోదైన కేసుల్లో ఈడీ తరఫున వాదనలు వినిపించారు. ఉగ్రవాదులు హఫీజ్‌ సయీద్‌, సయ్యద్‌ సలాలుద్దీన్‌లపై నమోదైన కేసులతో పాటు, ఎయిర్‌ ఇండియా, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోస్కీలపై పెట్టిన కేసుల్లోనూ ఈడీకి ప్రాతినిధ్యం వహించారు. భూషణ్‌ పవర్‌ స్టీల్‌ స్కాం, రాన్‌బాక్సీ-రెలిగేర్‌ కుంభకోణం, స్టెర్లింగ్‌ బయోటెక్‌, పశ్చిమ బెంగాల్‌లో పఽశువుల స్మగ్లింగ్‌ కేసుల్లో వాదనలు వినిపించారు. మనీలాండరింగ్‌ కేసులో బ్రిటన్‌ వెళ్లి అక్కడ ఈడీ తరఫున వాదించారు.

Updated Date - 2023-03-13T02:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising