Elections in Odisha : ఒడిశాలో ముందస్తు ఎన్నికలు?
ABN, First Publish Date - 2023-08-30T04:16:19+05:30
లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటూ ఓవైపు ఊహాగానాలు సాగుతుండగా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కొద్దినెలల్లో ఉండగా.. మరో రాష్ట్ర ప్రభుత్వం ముంద స్తు ఎన్నికలకు వెళ్తుందనే కథనాలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ వరకు అసెంబ్లీ
5 రాష్ట్రాలతో పాటే ఎన్నికలకు వెళ్తుందని అంచనా
13న కేంద్ర ఎన్నికల బృందం పర్యటన
భువనేశ్వర్, ఆగస్టు 29: లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటూ ఓవైపు ఊహాగానాలు సాగుతుండగా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కొద్దినెలల్లో ఉండగా.. మరో రాష్ట్ర ప్రభుత్వం ముంద స్తు ఎన్నికలకు వెళ్తుందనే కథనాలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జూన్ వరకు అసెంబ్లీ గడువున్నప్పటికీ ఒడిసాలో ఈ ఏడాదే ఎన్నికలుంటాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనికితగ్గట్లే వచ్చే నెల 13న కేంద్ర ఎన్నికల బృందం ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. అంతేగాక.. అక్టోబరు నాటికి ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల పరిశీలనను పూర్తి చేసి నవంబరు 15కు ఎన్నికలకు అన్నీ సిద్ధంగా ఉంచుతామని ఒడిసా ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) నికుంజ బిహారీ వివరించారు. కేంద్ర ఎన్నికల బృందం పర్యటనకు ముందస్తుతో సంబంధం లేదని మాత్రం పేర్కొన్నారు. అయితే, రాష్ట్రంలో రాజకీయ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికల గురించి తరచూ ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధమంటూ అధికార బీజేడీ, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ వ్యాఖ్యానించాయి. కేంద్ర మంత్రి, ఒడిసా బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ ముందస్తు ఎన్నికలు జరగొచ్చని వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-08-30T04:16:19+05:30 IST