గూగుల్ మ్యాప్స్‌తో డ్రైవింగ్.. నదిలోకి దూసుకెళ్లిన కారు
ABN, First Publish Date - 2023-10-03T02:06:58+05:30
డ్రైవింగ్‌లో గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ.. సూచనలు సరిగ్గా పాటించకపోవడంతో ఓ కారు నదిలోకి దూసుకెళ్లింది....
కేరళలో ఇద్దరు యువ వైద్యుల మృతి
కొచ్చి, అక్టోబరు 2: డ్రైవింగ్‌లో గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ.. సూచనలు సరిగ్గా పాటించకపోవడంతో ఓ కారు నదిలోకి దూసుకెళ్లింది. కేరళలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. త్రిస్సూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న అద్వైత్(29) కొచ్చిలో తన పుట్టిన రోజు వేడుకను ముగించుకొని, నలుగురు స్నేహితులతో కలిసి ఆదివారం తెల్లవారుజామున కారులో తిరుగు పయనమయ్యారు. గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ ప్రయాణిస్తుండగా కారు నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అద్వైత్‌తోపాటు మరో వైద్యుడు అజ్మల్(29) ప్రాణాలను కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. భారీ వర్షం వల్ల దారి కనపడలేదని, మ్యాప్స్‌లో చూపించినట్లు లెఫ్ట్ టర్న్ తీసుకోకుండా నేరుగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
Updated Date - 2023-10-03T02:06:58+05:30 IST