ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదిమ గిరిజనుల అభ్యున్నతికి 15 వేల కోట్లు!

ABN, First Publish Date - 2023-02-02T02:00:18+05:30

దేశంలో అంతరించిపోయే ముప్పు ఉన్న ఆదిమ జాతి గిరిజనుల కోసం పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో అంతరించిపోయే ముప్పు ఉన్న ఆదిమ జాతి గిరిజనుల కోసం పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేకించి దుర్భర స్థితిలో ఉన్న ఆదిమ గిరిజన తెగల(పీవీటీజీ) సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఈ పథకాన్ని తెస్తున్నట్లు తెలిపింది. ‘ప్రైమ్‌ మినిస్టర్‌- పర్టిక్యులర్లీ వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌ (పీఎం-పీవీటీజీ) డెవలప్‌మెంట్‌ మిషన్‌’ను అమలు చేసేందుకు రూ.15000 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఎస్టీల అభివృద్ధి కార్యాచరణలో భాగంగా మూడేళ్లలో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ మిషన్‌తో పీవీటీజీ కుటుంబాలు, ఆవాస ప్రాంతాలకు ప్రాథమిక ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం, రహదారులు, టెలికం కనెక్టివిటీ, స్థిరమైన జీవన ప్రమాణాలు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. అలాగే రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 749 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల్లో 38,800 మంది టీచర్లు, ఇతర సిబ్బందిని నియమించనున్నట్లు వివరించారు.

Updated Date - 2023-02-02T02:00:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising