ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడుగురు ఉగ్రవాదులకు మరణశిక్ష

ABN, First Publish Date - 2023-03-02T01:33:19+05:30

2017లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రైలులో బాంబు పేలుడుకు కారకులైన ఏడుగురు ఉగ్రవాదులకు మరణ శిక్ష విధిస్తూ లఖ్‌నవూలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు తీర్పు చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ, మార్చి1: 2017లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రైలులో బాంబు పేలుడుకు కారకులైన ఏడుగురు ఉగ్రవాదులకు మరణ శిక్ష విధిస్తూ లఖ్‌నవూలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు తీర్పు చెప్పింది. ఇదే కేసులో మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వీరంతా ఐసి్‌సకు అనుబంధంగా పనిచేశారని ఎన్‌ఐఏ అధికారులు చెప్పారు. 2017లోనే యూపీలో జరిగిన పలు హింసాత్మక సంఘటనల్లో ఈ ఉగ్రవాదులకు ప్రమేయం ఉందని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. మహమ్మద్‌ ఫైజల్‌, గౌస్‌ మహమ్మద్‌ ఖాన్‌, మహమ్మద్‌ అజహర్‌, అతిఫ్‌ ముజఫర్‌, మహమ్మద్‌ డానిష్‌, సయ్యద్‌ మీర్‌ హుస్సేన్‌, అసిఫ్‌ ఇక్బాల్‌ అలియాస్‌ రాకీలకు మరణశిక్ష పడింది. మహమ్మద్‌ అతిఫ్‌ అలియాస్‌ అతిఫ్‌ ఇరాకీకి యాజవజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇదిలా ఉండగా, ఉగ్ర చర్యలకు పాల్పడినందుకు గుజరాత్‌లో ఇద్దరు అన్నదమ్ములకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మంగళవారం అక్కడి ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. వసీం అరిఫ్‌ రమోదియా అలియాస్‌ నింజా ఫాక్స్‌, నయీం అరిఫ్‌ రమోదియా అలియాస్‌ ఎన్‌డీలకు ఈ శిక్ష పడింది.

Updated Date - 2023-03-02T01:33:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!