ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Manipur: మణిపూర్‌లో రాజ్యాంగ సంక్షోభం?

ABN, First Publish Date - 2023-08-22T02:36:46+05:30

మణిపూర్‌లో రాజ్యాంగ సంక్షోభం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల వ్యవధిలోగా అసెంబ్లీని సమావేశ పరచాలన్న నిబంధన ప్రస్తుతం అమలయ్యే పరిస్థితి లేదని అంటున్నాయి.

అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అనుమతివ్వని గవర్నర్‌

ఇంఫాల్‌, ఆగస్టు 21: మణిపూర్‌లో రాజ్యాంగ సంక్షోభం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల వ్యవధిలోగా అసెంబ్లీని సమావేశ పరచాలన్న నిబంధన ప్రస్తుతం అమలయ్యే పరిస్థితి లేదని అంటున్నాయి. ఆగస్టు 21 (సోమవారం)న సమావేశం జరపాలని రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల ప్రారంభంలో ప్రతిపాదించగా అందుకు గవర్నర్‌ ఇంతవరకు అనుమతి తెలపకపోవడమే ఇందుకు కారణం. అసెంబ్లీ చివరిసారిగా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు సమావేశమయింది. రాజ్యాంగంలోని 174వ అధికరణం ప్రకారం రెండు సమావేశాల మధ్య విరామం ఆరు నెలలకు మించకూడదు. దాని ప్రకారం సమావేశాలను సెప్టెంబరు 2లోగా జరపాల్సి ఉంది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం.. గవర్నర్‌ అనుమతి లభించిన తరువాత సమావేశాలు నిర్వహించే విషయమై కనీసం 15 రోజుల ముందుగా సభ్యులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. తక్షణ నిర్ణయాలు తీసుకొని నిర్ణీత వ్యవధిలోగా అసెంబ్లీ భేటీ జరగకుంటే అది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీయనుంది.

Updated Date - 2023-08-22T02:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising