ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cheetahs : చీతాలు.. సింగారం

ABN, First Publish Date - 2023-02-19T04:01:49+05:30

ప్రాజెక్టు చీతాలో భాగంగా భారత ప్రభుత్వం దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను తీసుకొచ్చింది. భారత వైమానిక దళానికి చెందిన సీ217 విమానం 12 చీతాలతో శనివారం ఉదయం 10 గంటలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కునో పార్కులోకి మరో 12 చీతాలు..

దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన భారత ప్రభుత్వం

ఎన్‌క్లోజర్‌ నుంచి వదిలిన శివరాజ్‌, భూపిందర్‌..

దేశంలో మొత్తం 20కి పెరిగిన సంఖ్య

శేవోపూర్‌, ఫిబ్రవరి 18: ప్రాజెక్టు చీతాలో భాగంగా భారత ప్రభుత్వం దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను తీసుకొచ్చింది. భారత వైమానిక దళానికి చెందిన సీ217 విమానం 12 చీతాలతో శనివారం ఉదయం 10 గంటలకు గ్వాలియర్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయింది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వాటిని కునో నేషనల్‌ పార్కుకు తరలించారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, కేంద్ర అటవీశాఖ మంత్రి భూపిందర్‌యాదవ్‌ చీతాలను నేషనల్‌ పార్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ ఆవాసాల్లోకి విడిచిపెట్టారు. తాజాగా కేంద్రం తరలించిన చీతాల్లో ఏడు మగవి. ఐదు ఆడవి. వీటితో కలిపి దేశంలో మొత్తం చీతాల సంఖ్య 20కి పెరిగింది. ప్రాజెక్టు చీతాలో భాగంగానే గతేడాది సెప్టెంబరులో నమీబియా నుంచి 8 చీతాలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాటిని కూడా కునో నేషనల్‌ పార్కులోనే వదిలిపెట్టారు. దేశంలో చిట్టచివరిసారిగా 1947లో ప్రస్తుత ఛత్తీ్‌సగఢ్‌లోని కొరియా జిల్లాలో చీతా కళేబరం కనిపించింది. ఇండియాలో చీతాను అంతరించిపోయిన జాతిగా 1952లో ప్రకటించారు. అయితే, చీతాలను తిరిగి భారత్‌కు రప్పించడం కోసం 2009లో అప్పటి కేంద్రమంత్రి జైరామ్‌ రమేశ్‌ ప్రాజెక్టు చీతాను ప్రతిపాదించారు.

Updated Date - 2023-02-19T04:01:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising