ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గూగుల్‌ డూడుల్‌గా ‘చంద్రయాన్‌-3’

ABN, First Publish Date - 2023-08-25T03:35:39+05:30

చంద్రయాన్‌-3 సక్సె్‌సను ప్రతిబింబించేలా ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ ప్రత్యేకం గా యానిమేటెడ్‌ డూడుల్‌ను రూపొందించింది.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: చంద్రయాన్‌-3 సక్సె్‌సను ప్రతిబింబించేలా ఇంటర్నెట్‌ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ ప్రత్యేకం గా యానిమేటెడ్‌ డూడుల్‌ను రూపొందించింది. గూగుల్‌ లోగో అంతరిక్షంలో మిణుకుమిణుకుమంటూ మెరిసే నక్షత్రాల నడుమ ఉన్నట్టు చిత్రీకరించింది. గూగుల్‌ ఆంగ్ల స్పెల్లింగ్‌లో మూడో అక్షరం(ఓ) స్థానంలో యానిమేటెడ్‌ చంద్రుడిని ఉంచింది. చంద్రుడి దక్షిణ ప్రాంతంలో ల్యాండర్‌ విజయవంతంగా దిగినందున యానిమేటెడ్‌ చంద్రుడి వెనుక వైపు ల్యాండర్‌ కనిపించేలా పెట్టింది. డూడుల్‌లోని చంద్రుడు చిరునవ్వులు చిందిస్తుండగా పక్కన ‘లవ్‌ సింబల్‌’ కూడా ఉంచింది. మౌస్‌ పాయింట్‌ను డూడుల్‌పై ఉంచగానే.. ‘చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలి ల్యాండింగ్‌ను నేటి డూడుల్‌ సెలబ్రేట్‌ చేస్తోంది’ అనే సందేశం ప్రత్యక్షమవుతోంది. డూడుల్‌పై మౌస్‌ను క్లిక్‌ చేయగా... చంద్రు డి చుట్టూ చంద్రయాన్‌-3 ఆర్బిటర్‌ తిరుగుతుండగా చంద్రుడు తన కళ్లను గుండ్రంగా తిప్పుతూ ఆర్బిటర్‌వైపే చూస్తున్నట్టు యానిమేషన్‌ వీడియో ప్రత్యక్షమవుతుంది. ల్యాండర్‌ చంద్రుడిని తాకగానే చంద్రుడు పరవశంతో మురిసిపోవడం, ల్యాండర్‌పై చంద్రుడు ప్రేమను వ్యక్తం చేస్తున్నట్టు లవ్‌ సింబల్‌ ప్రత్యక్షమవడం వీడియోలో కనిపిస్తుంది.

Updated Date - 2023-08-25T03:35:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising