ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అట్లుంటది మా వాడకం!

ABN, First Publish Date - 2023-06-21T04:49:02+05:30

మార్కెట్‌కు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సు.. సరదాగా షాపింగ్‌కు వెళ్లాలన్నా.. సినిమాకు వెళ్లాలన్నా, చుట్టాల ఇంటికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సే.. ఆఖరికి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సే..! కర్ణాటకలో ఆర్టీసీ బస్సులన్నీ

బీఎంటీసీ బస్సు వద్ద మహిళల రద్దీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్టీసీ బస్సుల్లో తెగ తిరిగేస్తున్న కర్ణాటక మహిళలు.. మార్కెట్‌, షాపింగ్‌, సినిమా అన్నింటికీ బస్సే

(బెంగళూరు–ఆంధ్రజ్యోతి)

మార్కెట్‌కు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సు.. సరదాగా షాపింగ్‌కు వెళ్లాలన్నా.. సినిమాకు వెళ్లాలన్నా, చుట్టాల ఇంటికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సే.. ఆఖరికి ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సే..! కర్ణాటకలో ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయి. గతంలో బయటికొస్తే చాలు ఆటో... అని పిలిచే మహిళలు ఇప్పుడు వాటి జోలికి వెళ్లడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయమే దీనికి కారణం. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలు, విద్యార్థినులకు ఉచిత ప్రయాణం ప్రకటించింది. అధికారం చేపట్టగానే ఈ నెల 11 నుంచి ముఖ్యమంత్రి సిద్దరామయ్య శక్తి గ్యారెంటీ పథకానికి శ్రీకారం చుట్టారు. దీంతో మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఎంచక్కా బస్సెక్కేస్తున్నారు. పల్లె లేదు.. పట్టణం లేదు.. కర్ణాటక రాష్ట్రంలో అన్ని ప్రాంతాల మహిళలు బస్సులెక్కి తెగ తిరిగేస్తున్నారు. ఈ పథకం అమల్లోకొచ్చింది మొదలు.. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలోనే 3.69 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. తద్వారా ఆర్టీసీపై రూ.84.20 కోట్ల భారం పడింది. కాగా, ఈ వారం రోజుల ఉచిత ప్రయాణాల్లోనే ఎన్నెన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్ని....

మహిళల వైపు కొరియర్‌ కంపెనీల చూపు

మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉన్నందున కొరియర్‌ కంపెనీలు, మార్కెటింగ్‌ విభాగాలు మహిళలను ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. బెంగళూరుతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళా నియామకాలు ఊపందుకున్నాయి. మరోవైపు, రాష్ట్రంలోని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలు ఐదారు రోజులుగా మహిళలతో కిటకిట లాడుతున్నాయి. రాష్ట్రంలో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య 20% తగ్గుముఖం పట్టిందని రైల్వే అధికారుల సమాచారం.

ఫుట్‌బోర్డు ప్రయాణం.. వ్యక్తి దుర్మరణం

మండ్య జిల్లా పాండవపుర తాలూకా జక్కనహళ్లి సమీపాన డోర్‌లో నిలబడి ప్రయాణిస్తున్న అరకనకెరె నివాసి చెలువేగౌడ (65) సోమవారం కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మహిళలు ఎక్కువగా ఉండటంతో లోపలికెళ్లే పరిస్థితి లేక ఫుట్‌బోర్డుపైనే నిలబడి ప్రమాదానికి గురయ్యాడు. బెళగావి జిల్లా రామదుర్గ బస్టాండ్‌లో ఫుట్‌బోర్డు మీద నిలబడిన బాలిక కిందపడింది. డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.

ఏకంగా బస్సు బుకింగ్‌..

బెంగళూరు బ్యాడరహళ్లికి చెందిన సునంద అనే మహిళ ఏకంగా బస్సునే బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నించారు. బెంగళూరు కేఎస్‌ఆర్టీసీ అధికారులను సోమవారం కలిసిన ఆమె.. నాలుగైదు రోజుల పాటు ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనకు వెళ్లదలిచామని, ప్రస్తుతానికి బంధుమిత్రులు 25 మంది ఉన్నామని, మిగిలిన సీట్లను పురుషులతో భర్తీ చేసుకుంటామని వినతి పత్రం ఇచ్చారు. లేదంటే మహిళా సంఘాల సభ్యులతో కలిసి 48 మంది వెళతామని వినతి పత్రంలో పేర్కొన్నారు.

Updated Date - 2023-06-21T04:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising