ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యువ శాస్త్రవేత్త స్వాతి నాయక్‌కు బోర్లాగ్‌ అవార్డు

ABN, First Publish Date - 2023-09-22T02:45:43+05:30

ఒడిసాకు చెందిన యువ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ స్వాతీ నాయక్‌కు ప్రతిష్ఠాత్మకమైన నార్మన్‌ ఇ బోర్లాగ్‌ అవార్డు లభించింది. ఆమెను విశిష్ట యువ శాస్త్రవేత్తగా గుర్తిస్తూ 2023 సంవత్సరానికిగానూ ఈ పురస్కారాన్ని

ఒడిసాకు చెందిన ఆమె ఎన్‌.జి.రంగా వర్సిటీ విద్యార్థిని

వాషింగ్టన్‌, సెప్టెంబరు 21: ఒడిసాకు చెందిన యువ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ స్వాతీ నాయక్‌కు ప్రతిష్ఠాత్మకమైన నార్మన్‌ ఇ బోర్లాగ్‌ అవార్డు లభించింది. ఆమెను విశిష్ట యువ శాస్త్రవేత్తగా గుర్తిస్తూ 2023 సంవత్సరానికిగానూ ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్టు వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ)లో విత్తనాల విధానం-ఉత్పత్తుల యాజమాన్యం విభాగానికి దక్షిణాసియా అధిపతిగా పనిచేస్తున్నారు. చిన్న కమతాలు ఉన్న రైతులు డిమాండు అధికంగా ఉన్న వరి విత్తనాలను పండించేలా చేయడం, వాతావరణ పరిస్థితులను తట్టుకునే వరి వంగడాలను అందరికీ అందుబాటులో ఉండేలా చూడడం, పోషకాహార విలువలను ఉన్న వరి విత్తనాలను రూపొందించడంలో విశేషమైన కృషి చేసినందుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. అమెరికాలోని ఐయోవా రాష్ట్రం డెస్‌మొయిని్‌సలో అక్టోబరు 24-26 తేదీల్లో జరిగే నార్మన్‌ ఇ బోర్లాగ్‌ ఇంటర్నేషనల్‌ డైలాగ్‌ సదస్సులో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఆచార్య ఎన్‌.జి.రంగా విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదివిన స్వాతీ నాయక్‌ గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేశారు.

Updated Date - 2023-09-22T02:45:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising