ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bilawal : భారత్‌కు బిలావల్‌

ABN, First Publish Date - 2023-04-21T03:00:15+05:30

పాక్‌ విదేశీ వ్యవహారాల మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ వచ్చే నెలలో భారతదేశంలో పర్యటించనున్నారు. మే 4-5 తేదీల్లో గోవాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మే 4-5 తేదీల్లో పర్యటన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: పాక్‌ విదేశీ వ్యవహారాల మంత్రి బిలావల్‌ భుట్టో జర్దారీ వచ్చే నెలలో భారతదేశంలో పర్యటించనున్నారు. మే 4-5 తేదీల్లో గోవాలో జరగనున్న షాంఘై సహకార సంస్థ విదేశీమంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు రానున్నారు. 9 ఏళ్ల తర్వాత ఓ పాక్‌ మంత్రి భారత్‌కు రానుండడం విశేషం. చివరిసారిగా 2014లో అప్పటి పాక్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ భారతదేశంలో పర్యటించారు. 2019 తర్వాత ఇరు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు తీవ్రంగా చెడిన నేపథ్యంలో బిలావల్‌ భుట్టో భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, రెండు దశాబ్దాల క్రితం 8 దేశాలు కలసి తమ ఆర్థిక, రాజకీయ, సైనిక వ్యవహారాల పరిరక్షణ కోసం షాంఘై సహకార సంస్థను స్థాపించాయి. ఈ ఎనిమిది దేశాలు ప్రపంచంలోని 42 శాతం జనాభాను, అలాగే ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఏడాది సమావేశాలకు భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. పాక్‌తో పాటు చైనాను కూడా ఇందులో పాల్గొనాల్సిందిగా భారత్‌ ఆహ్వానం పంపింది.

Updated Date - 2023-04-21T03:00:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising