ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైడెన్‌కు చర్మ క్యాన్సర్‌.. గత నెలలో శస్త్రచికిత్స

ABN, First Publish Date - 2023-03-05T01:11:48+05:30

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ (80)కు క్యాన్సర్‌ శస్త్రచికిత్స జరిగింది. ఆయన ఛాతీపై గాయం రూపంలో ఉన్న వ్యాధి కణజాలాన్ని వైద్యులు తొలగించారు. బైడెన్‌కు ఫిబ్రవరి మూడో వారంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వాషింగ్టన్‌, మార్చి 4: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ (80)కు క్యాన్సర్‌ శస్త్రచికిత్స జరిగింది. ఆయన ఛాతీపై గాయం రూపంలో ఉన్న వ్యాధి కణజాలాన్ని వైద్యులు తొలగించారు. బైడెన్‌కు ఫిబ్రవరి మూడో వారంలో శస్త్రచికిత్స చేసినట్లు తెలుస్తోంది. గత నెల 16వ తేదీన ఆయనకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. అప్పట్లో.. అధ్యక్షుడికి ఏ ఆరోగ్య సమస్య లేదని వైద్యులు ప్రకటించారు. కానీ, ఆ తర్వాత బైడెన్‌ ఛాతీ చర్యంపై క్యాన్సర్‌ కణితిని గుర్తించారు. దీనికి ఇతర శరీర భాగాలకు వ్యాపించే లక్షణం లేనప్పటికీ.. జాగ్రత్తల్లో భాగంగా తొలగించారు. అయితే, ఇకపై మాత్రం ఎలాంటి చికిత్స అవసరం లేదని అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ వైద్యుడు డాక్టర్‌ కెవిన్‌ ఒకానర్‌ నివేదించారు. బైడెన్‌కు సోకింది బేసల్‌ సెల్‌ క్యాన్సర్‌ (బీసీసీ)గా వైద్యులు పేర్కొన్నారు. ఇది చర్మ ఉపరితలానికే పరిమితమయ్యే క్యాన్సర్‌. కాగా, బేసల్‌ సెల్స్‌.. కొత్త చర్మ కణాలను ఉత్పత్తి చేసి, మృత కణాలను చర్మంపైకి పంపుతాయి.

Updated Date - 2023-03-05T01:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising