ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాహుబలి క్రాష్‌ బ్యారియర్‌!

ABN, First Publish Date - 2023-03-05T01:16:15+05:30

కేంద్ర రోడ్డురవాణా మంత్రిత్వశాఖ కొత్త తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఉక్కుకు బదులుగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కంక బొంగులతో(వెదురు) రోడ్డు ‘క్రాష్‌ బ్యారియర్‌’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కంక బొంగులతో తయారీ.. ప్రపంచంలోనే తొలిసారి

నాగ్‌పూర్‌, మార్చి 4: కేంద్ర రోడ్డురవాణా మంత్రిత్వశాఖ కొత్త తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఉక్కుకు బదులుగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కంక బొంగులతో(వెదురు) రోడ్డు ‘క్రాష్‌ బ్యారియర్‌’ను(మూలమలుపుల దగ్గర రక్షణగా ఏర్పాటు చేసే గోడ) తయారు చేసింది. మహారాష్ట్రలోని వణీ-వరోరా హైవేపై 200 మీటర్ల పొడవున ఈ వెదురు క్రాష్‌ బ్యారియర్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ శనివారం వెల్లడించారు. ‘‘వెదురు క్రాష్‌ బ్యారియర్లు ఉక్కుకు సరైన ప్రత్యామ్నాయమే కాక పర్యావరణహితమైనవి, పునర్వినియోగానికి ఎంతో అనుకూలమైనవి’’ అని గడ్కరీ ట్వీట్‌ చేశారు. వణీ-వరోరా హైవేపై ఏర్పాటు చేసిన క్రాష్‌ బ్యారియర్‌కు ‘బాహుబలి’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. వెదురులోని బాంబూసా బాల్కోవా రకం నుంచి కర్రలను తీసుకొని, వాటిని క్రియోసోట్‌ నూనెతో శుద్ధి చేసి, హై డెన్సిటీ పాలీ ఇథిలీన్‌(హెచ్‌డీపీఈ)తో పూత పూసి ఈ క్రాష్‌ బ్యారియర్‌ను తయారు చేశారు. ఎన్నో పరీక్షలు నిర్వహించి, సమర్థమంతమైనది అని తేలిన తర్వాతే వెదురు క్రాష్‌ బ్యారియర్‌ను హైవేపై ఏర్పాటు చేశామని గడ్కరీ తెలిపారు.

Updated Date - 2023-03-05T01:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising