ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avin: వీధుల్లో ఆవిన్‌ ఉత్పత్తుల విక్రయాలు

ABN, First Publish Date - 2023-01-25T10:27:19+05:30

వేసవిలో ప్రజల సౌకర్యార్ధం వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఐస్‌క్రీమ్‌, మజ్జిగ, లస్సీ తదితరాలు విక్రయించాలని ఆవిన్‌ సంస్థ(Avin company) నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), జనవరి 24: వేసవిలో ప్రజల సౌకర్యార్ధం వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఐస్‌క్రీమ్‌, మజ్జిగ, లస్సీ తదితరాలు విక్రయించాలని ఆవిన్‌ సంస్థ(Avin company) నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఆవిన్‌ పాలు సహా 222 రకాల పాల ఉత్పత్తులు విక్రయిస్తోంది. ఆవిన్‌ అందిస్తున్న పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న, ఐస్‌క్రీమ్‌, లస్సీ ప్రజాదరణ పొందాయి. తాజాగా, తోపుడు బండ్ల ద్వారా ఆవిన్‌ ఐస్‌క్రీమ్‌, మజ్జిగ, లస్సీ తదితరాలు విక్రయించాలని ఆవిన్‌ నిర్ణయించింది. ఈ విషయమై ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.సుబ్బయన్‌ మాట్లాడుతూ, రానున్న వేసవి కాలంలో రాజధాని నగరం చెన్నై, శివారు ప్రాంతాల్లో తోపుడు బండ్ల ద్వారా ఆవిన్‌ ఉత్పత్తులు విక్రయించనున్నామన్నారు. ఇందుకోసం బ్యాటరీ సాయంతో నడిచే బండ్లు సిద్ధం చేశామని, ఇందుకోసం 100 మందిని నియమించాలని నిర్ణయించామన్నారు. నగరం, శివారు ప్రాంతాల్లో ఆసక్తి కలిగిన వారు ఆవిన్‌ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. ముందస్తు డిపాజిట్‌గా రూ.10 వేలు చెల్లించడంతో పాటు నెలకు రూ.30 వేలు తక్కువ కాకుండా ఐస్‌క్రీమ్స్‌ విక్రయాలు చేయాల్సి ఉందన్నారు. విక్రయాల్లో 10 శాతం 15 శాతం ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు.

Updated Date - 2023-01-25T10:27:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising