ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BVR Subramaniam: నీతి ఆయోగ్‌ సీఈవోగా బీవీఆర్‌ సుబ్రమణ్యం

ABN, First Publish Date - 2023-02-21T03:33:16+05:30

నీతి ఆయోగ్‌ సీఈవోగా ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి బీవీఆర్‌ సుబ్రమణ్యం నియామకమయ్యారు. ఆయన రెండేళ్ల పాటు నీతి ఆయోగ్‌ సీఈవోగా కొనసాగనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగువాడికి అరుదైన అవకాశం

వరల్డ్‌ బ్యాంకు ఈడీగా పరమేశ్వరన్‌ అయ్యర్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: నీతి ఆయోగ్‌ సీఈవోగా ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి బీవీఆర్‌ సుబ్రమణ్యం నియామకమయ్యారు. ఆయన రెండేళ్ల పాటు నీతి ఆయోగ్‌ సీఈవోగా కొనసాగనున్నారు. 1987వ బ్యాచ్‌, ఛత్తీ్‌సగఢ్‌ క్యాడర్‌కు చెందిన సుబ్రమణ్యం గతేడాది నుంచి ఇండియా ట్రేడ్‌ ప్రమోషన్‌ ఆర్గనైజేషన్‌(ఐటీపీఓ) చైర్మన్‌, ఎండీగా కొనసాగుతున్నారు. అంతకుముందు ఆయన జమ్మూకశ్మీర్‌ సీఎ్‌సగా పనిచేశారు. 2004-2008 మధ్యకాలంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌కు ప్రైవేటు కార్యదర్శిగా వ్యవహరించారు. 2008-2011 వరకు ప్రపంచ బ్యాంకులో పనిచేసిన ఆయన 2012లో తిరిగి ప్రధాన మంత్రి కార్యాలయంలో చేరారు. మోదీ ప్రధాని అయిన తర్వాత కూడా దాదాపు 10 నెలల పాటు పీఎంవోలో బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత చత్తీ్‌సగఢ్‌కు బదిలీ అయ్యారు. 2018లో జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన క్రమంలో అంతర్గత భద్రత వ్యవహారాల్లో నిపుణుడైన ఆయనను కేంద్రప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. కాగా ఇప్పటివరకు నీతి ఆయోగ్‌ సీఈవోగా కొనసాగిన పరమేశ్వరన్‌ అయ్యర్‌ అమెరికాలోని వరల్డ్‌ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. రాజేశ్‌ ఖుల్లార్‌ స్థానంలో నియామకమైన అయ్యర్‌.. మూడేళ్ల పాటు పదవిలో ఉంటారు.

Updated Date - 2023-02-21T03:33:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising