ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uttar Pradesh : యోగి ప్రభుత్వంపై అఖిలేశ్ విసుర్లు

ABN, First Publish Date - 2023-03-30T15:33:45+05:30

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్

Mamata Banerjee, Akhilesh Yadav
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లక్నో : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మాఫియాతోపాటు, వారిని శుభ్రపరిచేవారు కూడా పరిశుద్ధులు అయిపోతున్నారన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బుధవారం కోల్‌‌కతాలో బీజేపీ వాషింగ్ మిషన్‌ను ప్రదర్శించిన విషయాన్ని గుర్తు చేశారు.

పశ్చిమ బెంగాల్‌కు రావలసిన నిధులను విడుదల చేయడం లేదంటూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమత బెనర్జీ (Mamata Banerjee) బుధ, గురువారాల్లో కోల్‌కతాలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె బీజేపీ వాషింగ్ మిషన్ అంటూ ఓ ప్రదర్శన నిర్వహించారు. బట్టలను ఈ వాషింగ్ మిషన్‌లో వేసేటపుడు నలుపు రంగులో ఉన్నప్పటికీ, అవి బయటకు వచ్చేసరికి తెలుపు రంగులోకి మారుతున్నట్లు చూపించారు. అవినీతిపరులు బీజేపీలో చేరితే, వారిపై కేసులు ఉండటం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను గుర్తు చేస్తూ ఆమె ఈ విధంగా ప్రదర్శించారు. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకం కావాలని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాడాలని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆ పార్టీని గద్దె దించాలని పిలుపునిచ్చారు.

అఖిలేశ్ యాదవ్ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, బీజేపీ వాషింగ్ మిషన్‌ను మమత బెనర్జీ ప్రదర్శించారని చెప్పారు. తెలుపు రంగు దుస్తులు ధరించిన అవినీతిపరులు బీజేపీలో చేరిన తర్వాత నిష్కళంకులైపోతున్నారన్నారు. ఈ మిషన్‌కు అత్యాధునిక మోడల్ ఉత్తర ప్రదేశ్‌లో ఉందన్నారు. ఉత్తర ప్రదేశ్ బీజేపీ వాషింగ్ మిషన్‌లో మాఫియాతోపాటు, వారిని నిష్కళంకులను చేసేవారు కూడా పరిశుద్ధులైపోతున్నారని దుయ్యబట్టారు.

ఇవి కూడా చదవండి :

Modi Vs Mamata : కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట పాడిన దీదీ.. వీడియో వైరల్

Lalit Modi Vs Rahul Gandhi : రాహుల్ గాంధీకి లలిత్ మోదీ హెచ్చరిక

Updated Date - 2023-03-30T15:33:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising