ఏఐఎస్‌లు మీ స్టాక్‌ల వివరాలివ్వండి!
ABN, First Publish Date - 2023-03-31T03:17:27+05:30
ఆల్ ఇండియా సర్వీసుల్లో (ఏఐఎస్) విధులు నిర్వహిస్తున్న అధికారులు తమ స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన లావాదేవీల వివరాలను
న్యూఢిల్లీ, మార్చి 30: ఆల్ ఇండియా సర్వీసుల్లో (ఏఐఎస్) విధులు నిర్వహిస్తున్న అధికారులు తమ స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన లావాదేవీల వివరాలను సమర్పించాలని గురువారం కేంద్రం కోరింది. ఒక వార్షిక సంవత్సరంలో ఆరు నెలల ప్రాథమిక వేతనానికి మించి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు), ఐపీఎస్ (ఇండియన్ పోలీసు సర్వీసు), ఐఎ్‌ఫఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు) అధికారులు తప్పనిసరిగా వారి వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. ఆల్ ఇండియా సర్వీసు నిబంధనలు-1968 ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎ్‌ఫఎస్ అధికారులు ప్రతి ఏడాది వారి ఆర్థిక పెట్టుబడులకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఏడాది అదనంగా స్టాక్ మార్కెట్‌లలో పెట్టుబడుల వివరాలను కూడా సమర్పించాల్సిందిగా కేంద్రం వారిని కోరింది
Updated Date - 2023-03-31T03:17:27+05:30 IST