ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఐ ప్రయోగాలు ఆర్నెల్లు ఆపాలి

ABN, First Publish Date - 2023-03-31T03:28:27+05:30

శరవేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ)పై ఆందోళనలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఏఐ విజృంభణతో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ పిలుపు

బహిరంగ లేఖపై ఆయనతో సహా వెయ్యి మందికిపైగా నిపుణుల సంతకం

న్యూఢిల్లీ, మార్చి 30: శరవేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ)పై ఆందోళనలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఏఐ విజృంభణతో భవిష్యత్తులో సమాజానికి పొంచి ఉన్న ముప్పు సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోతోంది. ఏఐ భారీ ఎత్తున ఉద్యోగాల కోతకు దారితీస్తుందన్న అంచనాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘దిగ్గజ ఏఐ ప్రయోగాలు’ ఆరు నెలలు ఆపాలని పిలుపునిచ్చిన బహిరంగ లేఖపై టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌తోపాటు వెయ్యి మందికి పైగా టెక్‌ రంగంలోని నిపుణులు సంతకాలు చేశారు. శక్తిమంతమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధిని తగ్గించకపోతే ప్రమాదాలు తప్పవన్న అంచనాతో వారున్నారు. ఓపెన్‌ఏఐకి చెందిన జీపీటీ-4కన్నా శక్తివంతమైనది ఏదైనా సమాజానికి ప్రమాదకరంగా మారవచ్చని లేఖలో పేర్కొన్నారు. శక్తిమంతమైన ఏఐ వ్యవస్థల ప్రభావం సానుకూలంగా, వాటి నష్టాలు నిర్వహించేలా ఉంటాయని విశ్వసించినప్పుడే వాటిని అభివృద్ధి చేయాలని తెలిపారు. ఏఐ ల్యాబ్‌లు శక్తిమంతమైన డిజిటల్‌ మేధస్సును అభివృద్ధి చేయడానికి పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. కాగా ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌అల్ట్‌మాన్‌ లేఖపై సంతకం చేయలేదు.

Updated Date - 2023-03-31T03:28:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising