ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

ABN, First Publish Date - 2023-01-27T03:18:12+05:30

గల్ఫ్‌ దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో గురువారం 74వ గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దుబాయిలో భారతీయ కాన్సులేట్‌ జనరల్‌ అమన్‌ పూరీ పతాకావిష్కరణ చేసి రాష్ట్రపతి ప్రసంగాన్ని చదివి వినిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెపరెపలాడిన భారత జాతీయ పతాకం

(ఆంఽధ్రజ్యోతి గల్ప్‌ ప్రతినిధి): గల్ఫ్‌ దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో గురువారం 74వ గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. దుబాయిలో భారతీయ కాన్సులేట్‌ జనరల్‌ అమన్‌ పూరీ పతాకావిష్కరణ చేసి రాష్ట్రపతి ప్రసంగాన్ని చదివి వినిపించారు. అలాగే, అబుధాబిలో రాయబారి సంజయ్‌ సుధీర్‌ పతాకావిష్కరణ చేసి రాష్ట్రపతి ప్రసంగాన్ని చదివారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులకు సేవలందిస్తున్న ఇండియన్‌ పీపుల్స్‌ ఫోరం వాలంటీర్లను రాయబారి సత్కరించారు. దుబాయిలో భారతీయ విద్యార్థులు జాతీయ స్ఫూర్తితో ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు, ఆలపించిన గేయాలు అబ్బురపర్చాయి. షార్జా, రాస్‌ అల్‌ఖైమా, ఇతర ఎమిరేట్లలోని భారతీయ సంఘాల్లో కూడా కాన్సులేటు అధికారులు భారత జాతీయ పతాకావిష్కరణలు చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో నూతన రాయబారి డాక్టర్‌ సుహేల్‌ అహ్మద్‌ ఖాన్‌, జెద్దాలో భారతీయ కాన్సులేటు జనరల్‌ షాహిద్‌ ఆలం పతాకావిష్కరణ చేసి ఆత్మనిర్భర్‌ గురించి ప్రస్తావించారు. కువైత్‌, ఖతర్‌, ఒమాన్‌, బహ్రెయిన్‌ దేశాల్లోని భారతీయ ఎంబీసీల ఆధ్వర్వంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. కొవిడ్‌ నిబంధనలను పూర్తిగా తొలగించిన అనంతరం అనేక దేశాల్లో గురువారం రాత్రి రాయబారులు విదేశీ అతిథులకు గణతంత్ర దినోత్సవ విందు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-01-27T03:18:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising