ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indore: ఇండోర్‌లో ప్రిన్సిపాల్‌కు పూర్వ విద్యార్థి నిప్పు!

ABN, First Publish Date - 2023-02-21T03:43:44+05:30

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. తన మార్క్‌షీట్‌ ఇవ్వలేదనే కారణంతో ఓ పూర్వవిద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్‌పై పెట్రోల్‌ పోసి, నిప్పంటించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్‌, ఫిబ్రవరి 20: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం జరిగింది. తన మార్క్‌షీట్‌ ఇవ్వలేదనే కారణంతో ఓ పూర్వవిద్యార్థి కళాశాల ప్రిన్సిపాల్‌పై పెట్రోల్‌ పోసి, నిప్పంటించాడు. తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇండోర్‌ జిల్లా సిమ్రోల్‌లోని బీఎం బీ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్‌ విముక్తశర్మ(54) సోమవారం కళాశాల ముగిసిన తర్వాత ఆవరణలోని ‘బిల్వపత్ర’ ఆకులను తెంపుతోంది. అదే కళాశాలలో గతేడాది చదువు పూర్తిచేసుకున్న అశుతోష్‌ శ్రీవాత్సవ(24) అనే విద్యార్థి పెట్రోల్‌ బాటిల్‌తో ఆమె వద్దకు వెళ్లాడు. ఆమెపై పెట్రోల్‌ పోసి, నిప్పంటించాడు. 80 శాతం శరీరం కాలిపోయి తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కాగా శ్రీవాత్సవ గత సంవత్సరమే చదువు పూర్తిచేసుకున్నా తన మార్క్‌షీట్‌ ఇంకా ఇవ్వకపోవడంతోనే అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది.

Updated Date - 2023-02-21T03:43:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising