బెంగాల్‌లో నడిరోడ్డుపై బీజేపీ నేత కాల్చివేత
ABN, First Publish Date - 2023-04-03T01:30:02+05:30
పశ్చిమ బెంగాల్‌లో ఓ బీజేపీ నేతను దుండగులు నడిరోడ్డుపై కాల్చివేశారు. ఈ ఘటన పూర్బ బర్ధమన్ జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. పలు కేసుల్లో నిందితుడు, అనుమతులు
కోల్‌కతా, ఏప్రిల్ 2: పశ్చిమ బెంగాల్‌లో ఓ బీజేపీ నేతను దుండగులు నడిరోడ్డుపై కాల్చివేశారు. ఈ ఘటన పూర్బ బర్ధమన్ జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. పలు కేసుల్లో నిందితుడు, అనుమతులు లేకుండా బొగ్గు వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజు ఝా, 2021లో బీజేపీలో చేరారు. ఆయన తన స్నేహితుడితో కలిసి శనివారం రాత్రి కారులో కోల్‌కతా వెళ్తూ ఓ చోట ఆగారు. అప్పుడే మరో కారు వారి పక్కనే వచ్చి ఆగింది. అందులోని దుండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో రాజు ఝా మరణించ గా, ఆయన స్నేహితుడు గాయపడ్డారు.
Updated Date - 2023-04-03T01:30:02+05:30 IST