ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

41 లక్షల లీటర్ల నీళ్లు తోడించిన

ABN, First Publish Date - 2023-06-01T00:49:57+05:30

సెల్‌ఫోన్‌ గాలించడం కోసం ఛత్తీ్‌సగఢ్‌లోని ఖేర్కట్ట డ్యామ్‌లోని 41 లక్షల లీటర్ల నీళ్లు తోడించిన నీటిపారుదల శాఖ అధికారి ఆర్‌ఎల్‌ దివార్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారిపై సస్పెన్షన్‌ వేటు

రాయ్‌పూర్‌, మే 31 : సెల్‌ఫోన్‌ గాలించడం కోసం ఛత్తీ్‌సగఢ్‌లోని ఖేర్కట్ట డ్యామ్‌లోని 41 లక్షల లీటర్ల నీళ్లు తోడించిన నీటిపారుదల శాఖ అధికారి ఆర్‌ఎల్‌ దివార్‌ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మే 21 నుంచి నాలుగు రోజుల పాటు ఖేర్కట్ట డ్యామ్‌ నుంచి అనధికారంగా నీటిని తోడేస్తున్న దివార్‌(ఇన్‌చార్జి సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌) ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే వేటు వేశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఛత్తీ్‌సగఢ్‌లోని కోయలిబేడా బ్లాక్‌లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసే రాజేశ్‌ విశ్వా్‌సకు చెందిన సెల్‌ఫోన్‌ ఖేర్కట్ట డ్యామ్‌లో పడగా దాని కోసం నీటిని తోడేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి విశ్వాస్‌ ఇప్పటికే సస్పెన్షన్‌కు గురవ్వగా, అతనికి రూ.53 వేల జరిమానా కూడా విధించారు.

Updated Date - 2023-06-01T00:49:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising