ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం 20 మంది మృతి

ABN, First Publish Date - 2023-08-02T04:31:42+05:30

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణ పనుల్లో పిల్లర్ల పైకి బీమ్‌లను తీసుకెళ్లే యంత్రం(క్రేన్‌) కూలి 20 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఽథానే

ముంబై, ఆగస్టు 1: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణ పనుల్లో పిల్లర్ల పైకి బీమ్‌లను తీసుకెళ్లే యంత్రం(క్రేన్‌) కూలి 20 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఽథానే జిల్లాలోని షాహ్‌పూర్‌లోని సర్లంబే గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున సంభవించింది. ఎక్స్‌ప్రెస్‌ వే మూడో దశ పనుల్లో భాగంగా చేపట్టిన బ్రిడ్జి నిర్మాణంలో 15, 16 నంబర్ల పిల్లర్లపైకి బీమ్‌లను తీసుకెళుతుండగా దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి బీమ్‌లతో సహా ఆ క్రేన్‌ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బ్రిడ్జిని నవయుగ ఇంజనీరింగ్‌, సింగపూర్‌కు చెందిన వీఎ్‌సఎల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు నిర్మిస్తున్నాయి. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం శిందే మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ముంబై- నాగ్‌పూర్‌లను కలుపుతూ దాదాపు 701 కి.మీల పొడవునా ఈ ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మిస్తుండగా, ఇప్పటికే 600 కి.మీల నిర్మాణం పూర్తైంది.

Updated Date - 2023-08-02T04:31:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising