ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: విరిగిన కిటికీ తలుపులు.. ఇంట్లో దొంగలు పడ్డారంటూ మహిళ ఫోన్.. లోపలికి వెళ్తే బాత్రూంలో కనిపించిన సీన్ చూసిన పోలీసులకు..

ABN, First Publish Date - 2023-02-04T19:35:48+05:30

అమెరికా మహిళకు షాకింగ్ అనుభవం. ఇంటి బాత్రూమ్‌లోకి ప్రవేశించిన యువకుడు. ఎందుకని ప్రశ్నిస్తే సమాధానం చెప్పని వైనం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: బయటకువెళ్లి ఇంటికి తిరిగొచ్చిన ఓ అమెరికా(USA) మహిళ..కిటికీల అద్దాలు పగిలుండటం(Broken windows) గమనించి భయభ్రాంతులకు లోనైంది. ఇంట్లో దొంగలు పడి ఉంటారని అనుమానించి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మహిళ ఇంటి బాత్రూమ్‌లో మరో షాకింగ్ సీన్ కనిపించింది. స్నానాల తొట్టెలో ఓ యువకుడు కులాసాగా కూర్చుని ఉండటాన్ని గమనించి వారు ఆశ్చర్యపోయారు. సియాటెల్ నగరంలో(Seattle) వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది.

మహిళ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వేగంగా ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంట్లో ఎవరైనా ఉంటే తక్షణం బయటకు రావాలంటూ తొలుత హెచ్చరించారు. కానీ.. ఎటువంటి స్పందనా రాకపోవడంతో వారే లోపలికెళ్లి చూశారు. బాత్ టబ్‌లో ఓ యువకుడు ఉండటం(Youth in Bathtub) చూసి ఆశ్చర్యపోయారు. అతడి ఇంటిపై ఉన్న దస్తులన్నీ పూర్తిస్థాయిలో తడిసిపోయాయి. పేరేంటని అతడిని పోలీసులు పలు మార్లు ప్రశ్నించినా అతడు జవాబు ఇవ్వలేదు. దీంతో..వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎవరో.. మహిళ ఇంట్లోకి ఎందుకు ప్రవేశించాడో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2023-02-04T19:35:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising