ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Oscars: అట్టహాసంగా మొదలైన ‘ఆస్కార్’ పండుగ.. ‘నాటు నాటు’ డ్యాన్స్‌తో దద్దరిల్లిన డాల్బీ థియేటర్

ABN, First Publish Date - 2023-03-13T07:15:22+05:30

ప్రపంచ సినిమా పండుగ అట్టహాసంగా మొదలైంది. 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం లాస్‌ ఏంజెల్స్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రపంచ సినిమా పండుగ అట్టహాసంగా మొదలైంది. 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం లాస్‌ ఏంజెల్స్‌లో ఘనంగా జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఐదు గంటలకు వేడుక ప్రారంభం అయింది. కోట్లాది మంది తెలుగు ప్రజల ఆస్కార్‌ కలలను నిజం చేస్తూ అంతర్జాతీయ వేదికపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’సత్తా చాటాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో పోటీ పడుతున్న ‘నాటు నాటు’పాటను ఆస్కార్‌ వరించాలని ఆకాంక్షిస్తున్నారు .దర్శకుడు రాజమౌళి,ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు.

ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’పాటకు హాలీవుడ్ డ్యాన్సర్లు చిందులేసి ఉర్రూతలూగించారు. ఈ పాట ప్రదర్శించిన సందర్భంలో కేరింతలతో ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ జరుగుతున్న డాల్బీ థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఇప్పటికే పలు విభాగాల్లో ‘ఆస్కార్’ అవార్డులను ప్రకటించారు. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్‌గా ‘యాన్ ఐరిష్ గుడ్‌బై’ ఆస్కార్ దక్కించుకుంది. ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో జేమ్స్ ఫ్రెండ్‌ను ఆస్కార్ వరించింది. ఉత్తమ సహాయనటుడిగా కే హ్యూ క్వాన్ ‘ఆస్కార్’ అవార్డును దక్కించుకున్నారు. ఇప్పటికి ‘ఆస్కార్’ అవార్డులు ఏయే చిత్రాలకు, ఎవరెవరికి దక్కాయంటే..

ఇదిలా ఉండగా.. ఆస్కార్‌ వేడుకకు హాజరయ్యే ముందు రామ్‌చరణ్‌ అభిమానులను కలిశారు. అమెరికాలోని మెగా ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. వారితో చరణ్‌ ఆత్మీయంగా ముచ్చటించి, సెల్ఫీలు దిగారు. ‘నన్ను కలవడానికి అమెరికాలో ఎక్కడెక్కడి నుంచో కష్టపడి మరీ ఇంతదూరం వచ్చారు. మీ ప్రేమ, అభిమానం గురించి ఎంత చెప్పినా తక్కువే. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటాను’ అని చరణ్‌ ఉద్వేగంగా చెప్పారు.

ఎన్టీఆర్‌ కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడిపారు.‘నాటు నాటు పాట’ కోసం చిత్రబృందం పడిన కష్టాన్ని ఆయన మీడియాతో పంచుకున్నారు. ‘స్నేహం గొప్పదనాన్ని సరికొత్తగా ఆవిష్కరించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’’ అని ఎన్టీఆర్‌ అన్నారు. ‘నాటు నాటు’ పాట కోసం చరణ్‌తో కలసి కొన్ని రోజులపాటు ప్రాక్టీస్‌ చేసినట్లు చెప్పారు. ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్‌లో భాగమవ్వడం కంటే గొప్ప ఆనందం ఇంకేం ఉండదు అన్నారు. హాలీవుడ్‌ నటుడు బ్రెండెన్‌ ఫ్రాజర్‌తో ఎన్టీఆర్‌ దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Updated Date - 2023-03-15T19:28:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising