Pakistan Terrorist: పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతం..
ABN, First Publish Date - 2023-10-01T15:54:16+05:30
పాకిస్థాన్(Pakistan) ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కీలక నాయకులలో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్(Mufti Qaiser Farooq)ను పాకిస్థాన్ రాజధాని కరాచీ(Karachi)లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.
కరాచీ: పాకిస్థాన్(Pakistan) ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కీలక నాయకులలో ఒకరైన ముఫ్తీ ఖైజర్ ఫరూఖ్(Mufti Qaiser Farooq)ను పాకిస్థాన్ రాజధాని కరాచీ(Karachi)లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. హతుడు 26/11 ముంబయి(Mumbai Terror Attack) ఉగ్రవాద దాడి సూత్రధారి హఫీజ్ సయీద్ కి సన్నిహితుడు. మత పరమైన కార్యక్రమానికి హాజరై వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని వెనక నుంచి కాల్చారు.
దీంతో అతని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఫరూఖ్ మృతి చెందాడు. అతని హత్యకు సంబంధించిన సీసీటీవీ(CC TV visuals) ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఘటన జరిగిన తేదీ బయటకు రాలేదు. తాజా ఘటనతో సొంత గడ్డపైనే ఉగ్రవాది హతమవడం సంచలనం సృష్టిస్తోంది.
Updated Date - 2023-10-01T15:54:16+05:30 IST