ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Khalistani Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్‌కి ఊహించని దెబ్బ.. నిషేధం విధించాలంటూ డిమాండ్

ABN, First Publish Date - 2023-09-27T19:33:44+05:30

భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం చెలరేగినప్పటి నుంచి.. కెనడాలో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాదులు పెట్రేగిపోతున్నారు. ముఖ్యంగా.. భారతదేశం ఉగ్రవాదిగా ప్రకటించిన ‘సిక్స్ ఫర్ జస్టిస్’ సంస్థ అధిపతి గురుపత్వంత్ సింగ్ పన్నున్...

భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం చెలరేగినప్పటి నుంచి.. కెనడాలో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాదులు పెట్రేగిపోతున్నారు. ముఖ్యంగా.. భారతదేశం ఉగ్రవాదిగా ప్రకటించిన ‘సిక్స్ ఫర్ జస్టిస్’ సంస్థ అధిపతి గురుపత్వంత్ సింగ్ పన్నున్ అయితే బహిరంగంగానే హిందువులకు హెచ్చరికలు జారీ చేశాడు. కెనడాలో ఉన్న హిందువులందరూ దేశం విడిచి భారత్‌కి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో.. కెనడాలో అడుగుపెట్టకుండా అతడ్ని బహిష్కరించాలని హిందూ ఫోరమ్ కెనడా (HFC) కోరింది. ద్వేషపూరిత ప్రసంగంతో గురుపత్వంత్ కెనడాలో ఉన్న భారతీయ హిందువుల్లో భయాన్ని వ్యాప్తి చేశారని ఆ ఫోరమ్ పేర్కొంది.

ఈ హిందూ ఫోరమ్‌కి చెందిన న్యాయ సలహాదారు పీటర్ థోర్నింగ్ మంగళవారం కెనడా పౌరసత్వ శాఖ మంత్రి మార్క్ మిల్లర్‌తో కలిశారు. ఈ సందర్భంగా HFC ఆందోళనను ఆయన దృష్టికి తీసుకొచ్చిన ఆయన.. ఇమ్మిగ్రేషన్ శాఖ తగిన విచారణ జరిపి, గురుపత్వంత్‌ను కెనడా నుంచి బహిష్కరించాల్సిందిగా కోరారు. ప్రత్యేక సిక్కు రాష్ట్ర ఏర్పాటు కోసం వాదించే సిక్కుల ఫర్ జస్టిస్ (SFJ) అని పిలువబడే US ఆధారిత సంస్థకు గురుపత్వంత్ ప్రతినిధిగా పని చేస్తున్నాడని మంత్రికి తెలియజేశారు. భారత ప్రభుత్వం అతడ్ని ఉగ్రవాదిగా ప్రకటించిందని.. అతని సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థను సైతం నిషేధించిందని తెలిపారు. అతడు ద్వేషపూరిత ప్రసంగాలతో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాడని.. హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రోత్సాహిస్తున్నాడని పేర్కొన్నారు.


సంప్రదాయ ప్రజాస్వామ్యం, ప్లూరలిజంపై భారత్, కెనడా మధ్య దీర్ఘకాల ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నాయని పీటర్ థోర్నింగ్ నొక్కి వక్కానించారు. భారతీయ సంతతికి చెందిన అతిపెద్ద కమ్యూనిటీలలో ఒకటైన సిక్కులకు ఈ కెనడా ఒక ఇల్లు లాంటిదని.. దాదాపు 4% కెనడియన్లు భారతీయ వారసత్వానికి చెందినవారు ఉన్నారని చెప్పారు. ‘పబ్లిక్ ఇన్‌సిట్‌మెంట్ ఆఫ్ ద్వేషం’ కింద సెక్షన్లను మంత్రికి వివరించిన పీటర్.. పన్నూన్‌పై దర్యాప్తు చేసి, అతనిపై కెనడాలో అడుగుపెట్టకుండా నిషేధించాలని కోరారు. అతడు కెనడాలోనే ఉండి హిందువులకు వార్నింగ్ ఇచ్చాడా, లేదా అనేది విచారణ జరిపి.. తగిన చర్యలు తీసుకోవాలని పీటర్ థోర్నింగ్ కెనడా మంత్రిని కోరారు.

ఇదిలావుండగా.. గురుపత్వంత్ కేవలం హిందులకు వార్నింగ్ ఇవ్వడమే కాదు.. భారత దౌత్యాధికారులతో పాటు ప్రభుత్వాధికారుల్ని బెదిరించాడు. దీంతో.. భారత ప్రభుత్వం ఇప్పటికే అతనిపై కన్నెర్ర జేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే అతని ఆస్తుల్ని జప్తు చేసింది.

Updated Date - 2023-09-27T19:33:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising