ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నన్ను పదేళ్లు జైల్లో బంధించేందుకు కుట్ర

ABN, First Publish Date - 2023-05-16T03:18:49+05:30

పాకిస్థాన్‌ సైన్యంపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సోమవారం మరోసారి వరుస ట్వీట్లలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాక్‌ ఆర్మీపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణ

లాహోర్‌, మే 15: పాకిస్థాన్‌ సైన్యంపై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సోమవారం మరోసారి వరుస ట్వీట్లలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహం అభియోగాలపై తనను పదేళ్ల పాటు జైలులో బంధించేందుకు సైన్యం కుట్ర పన్నిందని ఆరోపించారు. లండన్‌ వేదికగా పన్నిన కుట్ర బయటపడిందని పేర్కొన్నారు. తన చివరి రక్తం బొట్టు వరకు నిజమైన స్వాతంత్య్రం కోసం పోరాడతానని ప్రతినబూనారు. వంచకులకు బానిస కావడం కంటే చావు మేలు అని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ దాదాపు 100 కేసుల్లో బెయిల్‌పై ఉన్నారు. అల్‌–ఖదీర్‌ ట్రస్ట్‌ కేసులో ఈ నెల 9న ఆయన అరెస్టుతో హింస చెలరేగింది. దీంతో ఆయనపై కొత్తగా ఉగ్రవాదం అభియోగాల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బెయిల్‌ కోసం సోమవారం ఆయన తన భార్య బుష్రా బేగంతో కలిసి లాహోర్‌ హైకోర్టుకు హాజరయ్యారు. ఇమ్రాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం విచారిస్తామని కోర్టు ప్రకటించింది. బుష్రా బేగంను మే 23 వరకు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

Updated Date - 2023-05-16T03:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising